జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
Advertisement

తెలుగులో వాయిస్ టైపింగ్.. అంటే మనం మాట్లాడితే నేరుగా తెలుగు భాషలో టైపింగ్ అయిపోవడమన్న మాట. ఇది ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. గూగుల్ సంస్థ గూగుల్ వాయిస్ టైపింగ్ లో తెలుగు భాషను కూడా ప్రవేశపెట్టింది. దీనిని చాలా మంది ఉపయోగిస్తున్నారు కూడా. అయితే అదే తెలుగు వాయిస్ టైపింగ్ ను కంప్యూటర్ లోనూ పొందడానికి మంచి ట్రిక్ అందుబాటులో ఉంది. అయితే ఇందులోనూ తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటుంది. మనం ఫోన్ లో వాయిస్ టైపింగ్ చేస్తూ ఉంటే నేరుగా కంప్యూటర్లో కూడా టైపింగ్ అయిపోతుంటుంది. 


అంతేకాదు మన కంప్యూటర్ కు వైర్ లెస్ మౌస్ గా, వైర్ లెస్ కీబోర్డుగా కూడా పనిచేస్తుంది. కంప్యూటర్ లో పాటలు, వీడియోలను ప్లే చేయడం, నేరుగా సౌండ్ పెంచడం, తగ్గించడం వంటివీ చేసుకోవచ్చు. మరి కంప్యూటర్ లో తెలుగు వాయిస్ టైపింగ్, వైర్ లెస్ కీబోర్డు, మౌస్ గా మన స్మార్ట్ ఫోన్ ను ఎలా వినియోగించాలో చూద్దామా?


ముందుగా మీ ఫోన్ లో వాయిస్ టైపింగ్ యాప్ ఉందా.. లేకపోతే ముందు ఫోన్ లో తెలుగు వాయిస్ టైపింగ్ ఎలా చేయాలో ఈ కింది లింకులో చూడండి.
మాటలు విని తెలుగులో టైప్ చేసే అప్లికేషన్.. మీ ఫోన్లో ఉందా?

రెండింటిలో సాఫ్ట్ వేర్లు..

స్మార్ట్ ఫోన్ లో వాయిస్ టైపింగ్ వచ్చేశాక.. కంప్యూటర్లో తెలుగు, ఇంగ్లిష్ వాయిస్ టైపింగ్ కోసం, వైర్ లెస్ మౌస్ గా వినియోగం కోసం కంప్యూటర్ లో ఒక సాఫ్ట్ వేర్, ఫోన్ లో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఒక పెయిర్ (సర్వర్-క్లయింట్ సాఫ్ట్ వేర్) గా చెప్పుకోవచ్చు. ఈ రెండు ఒక దానికొకటి సింక్రనైజ్ అయి.. కంప్యూటర్ మీ మొబైల్ నియంత్రణలోకి వస్తుంది. ఇలాంటి పెయిర్ సాఫ్ట్ వేర్, యాప్ లు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని పెయిడ్ కాగా.. చాలా వరకు ఫ్రీగా లభిస్తాయి. ఉదాహరణకు కొన్ని సాఫ్ట్ వేర్-యాప్ పెయిర్లు..

మొత్తంగా కంప్యూటర్ లో తెలుగు వాయిస్ టైపింగ్ కోసం ఉండాల్సినవి..

ఇవి గుర్తుంచుకోండి

ఈ తరహా సర్వర్-క్లయింట్ సాఫ్ట్ వేర్లు పని చేయాలంటే మన కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ సీ రీడిస్ట్రిబ్యుటబుల్ అప్లికేషన్ గానీ, మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ గానీ ఉండి తీరాలి. అయితే కంప్యూటర్ లో మనం సర్వర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసేటప్పుడే.. మన కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ సీ రీడిస్ట్రిబ్యుటబుల్ అప్లికేషన్ గానీ, మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ ఉందా లేదా అన్నది ఆయా సాఫ్ట్ వేర్ల ఇన్ స్టలేషన్ ప్రక్రియే పరిశీలిస్తుంది. అవి లేనట్లయితే.. వాటిని డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయాలా? అని అడుగుతుంది. దానికి ఓకే చేస్తే సరిపోతుంది.ఈ ఇన్ స్టలేషన్ ల కోసం పెద్దగా డేటా కూడా ఖర్చు కాదు. కేవలం 100 నుంచి 150 ఎంబీ లోపే వినియోగమవుతుంది.

ఇదిగో ఇలా చేేస్తే సరి..

 తెలుగు వాయిస్ టైపింగ్, వైర్ లెస్ కీబోర్డు, మౌస్ గా వినియోగం ఎలా ఉంటుందో చూద్దాం. ఇందుకోసం ఉదాహరణగా Remote Link సాఫ్ట్ వేర్ ను చూద్దాం. ముందుగా స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి Remote Link యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఇన్ స్టాల్ చేసుకోవాలి.

ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి?

కంప్యూటర్ లోని సర్వర్ సాఫ్ట్ వేర్, స్మార్ట్ ఫోన్ లోని యాప్ రెండూ అనుసంధానం అయ్యాక ఈ పక్కన ఉన్నట్లుగా డిస్ప్లే వస్తుంది. ఇందులో ముందుగా ల్యాప్ టాప్ మౌస్ తరహాలో ఉపయోగించుకోగల ‘మౌస్ ప్యాడ్’ స్పేస్, దాని కింద మౌస్ ఎడమ, కుడి బటన్ల తరహాలో వినియోగించే రెండు ఆప్షన్లు L, R పేర్లతో అందుబాటులో ఉంటాయి.

వాయిస్ టైపింగ్ చేయండి ఇలా..

సరైన తెలుగు రావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

వైర్ లెస్ మౌస్, కీబోర్డుగా..

ఇక ఈ రిమోట్ సాఫ్ట్ వేర్లతో ఉన్న మంచి సౌలభ్యం వైర్ లెస్ మౌస్, వైర్ లెస్ కీబోర్డుగా పని చేయడం. మనం కంప్యూటర్ కు కాస్త దూరంగా కూర్చుని కూడా హాయిగా ఏవైనా ఓపెన్ చేయడం,చూసుకోవడం చేయవచ్చు.

ఇవీ అదనపు సదుపాయాలు..

Tue, Feb 20, 2018, 04:08 PM
Advertisement
2020-02-11T14:04:59+05:30
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View