లాభాలు కురిపిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఇవే
Advertisement

పెట్టుబడికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఈక్విటీలు అధిక రాబడులను అందిస్తున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే ఇదే తెలుస్తుంది. ఎవరికి వారు నేరుగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కంటే నిపుణులు నిర్వహించే మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఆశ్రయించడం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ (షేర్లు), డెట్ (బాండ్లు), ఈ రెండూ కలిసిన బ్యాలన్స్డ్ ఫండ్స్ వుంటాయి. ఇంకా వీటిలోనూ చాలా రకాల వైవిధ్యంతో కూడిన పథకాలున్నాయి. వేలాది ఫండ్ పథకాల్లో ఏవి మెరుగైన రాబడులను ఇస్తున్నాయో తెలుసుకుంటే నచ్చిన పథకాల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.


నేరుగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అన్నది అంత తేలిక వ్యవహారం కాదు. పెట్టుబడికి ఎంచుకునే స్టాక్స్ నాణ్యమైనవి, ఆర్థికంగా బలమైనవి, మంచి యాజమాన్యం గలవి ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది. సాధారణ ఇన్వెస్టర్లకు ఇది కష్టమైన పని. కానీ, మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లకు ఇది సులభమైన పని. ఎందుకంటే వారు ఇందులో నిష్ణాతులు. కావాల్సిన సమాచారాన్ని అవసరమైతే కంపెనీ నుంచి తెప్పించుకుని, తగిన పరిశోధన తర్వాత మంచి రాబడులను ఇచ్చే అవకాశం ఉన్న కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెడతారు. ఇది కాకుండా షేర్లను కొన్న వెంటనే రాబడులు రావు. నిరంతరం ఆ కంపెనీ పనితీరును పరిశీలిస్తూ ఉండాలి. అవసరమైతే ఎప్పుడు విక్రయించాలో కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ నిపుణులకు సాధ్యమయ్యే పనులు. అందుకే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో వెళ్లడం వల్ల ఒకింత రక్షణ ఉంటుంది.

representational imageప్యూర్ ఈక్విటీ ఫండ్స్
100 శాతం నిధులను షేర్లలోనే పెడతారు. కనుక రిస్క్ అధికంగా ఉంటుంది. స్వల్పంగా రిస్క్ తగ్గించేందుకు వీటిలోనూ స్థిరత్వం ఎక్కువగా ఉండే బ్లూచిప్ కంపెనీల్లో పెట్టే లార్జ్ క్యాప్ ఫండ్స్, ఆటుపోట్లు అధికంగా ఉండే మిడ్, స్మాల్ క్యాప్ (అంటే మార్కెట్ విలువ మధ్యస్థం, తక్కువగా ఉన్నవి) స్టాక్స్ల్ లో ఇన్వెస్ట్ చేసే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటూ వేర్వేరుగా ఉన్నాయి.
representational imageటాప్ హైబ్రిడ్ (బ్యాలన్స్ డ్) ఫండ్స్representational imageట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్)representational imageడెట్ ఫండ్స్ఈక్విటీ ఫండ్స్
లార్జ్ క్యాప్ ఫండ్స్: ఈక్విటీ మార్కెట్ విలువ అధిక స్థాయిలో ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ వద్దనుకునే వారికి ఇవొక చాయిస్. రాబడులు మోస్తరుగా ఉంటాయి.

మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్: మార్కెట్ విలువ మధ్యస్థం, తక్కువ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్క్ తీసుకునే వారి కోసం ఇవి. రాబడులు కూడా అధికంగానే ఉంటాయి.

డైవర్సిఫైడ్ ఫండ్స్: భిన్న రంగాలకు చెందిన కంపెనీల్లో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. దీంతో రిస్క్ మధ్యస్థంగా ఉంటుంది. రాబడులు కూడా సగటు కంటే ఎక్కువే ఉంటాయి.

ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్: ఇవి పన్ను ఆదా చేసే ఫండ్స్. ఈక్విటీలోనే దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. రిస్క్ తక్కువ ఉండేలా పెట్టుబడుల విధానం ఉంటుంది. సెక్షన్ 80సీ కింద ఈ ఫండ్స్ లో రూ.1.50లక్షల పెట్టుబడులపై వార్షికంగా పన్ను మినహాయింపు ఉంది.

representational imageడెట్ ఫండ్స్
ఇవి బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిని తక్కువ రిస్క్, తక్కువ రాబడులను ఇచ్చే ఫండ్స్ గా పేర్కొంటారు.

బ్యాలన్స్ డ్ లేదా హైబ్రిడ్ ఫండ్స్
ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఇవి. రిస్క్ తగ్గించి మెరుగైన రాబడులను ఇచ్చే విధంగా ఈ ఫండ్స్ విధానం ఉంటుంది.

ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్
ఓపెన్ ఎండెడ్ అంటే కొనుగోలుకు, విక్రయానికి ఎప్పుడూ అవకాశం ఉండే ఫండ్స్. క్లోజ్ ఎండెడ్ అంటే నిర్ణీత కాలం వరకూ అవి క్రయ, విక్రయాలకు అవకాశం లేనివి. గడువు తీరిన తర్వాతే వీటిని విక్రయించడానికి వీలుంటుంది.

గ్రోత్, డివిడెండ్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్ మెంట్
ఫండ్స్ ఏవైనా గానీ వాటిలో ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రోత్ అంటే మీ పెట్టుబడిపై రాబడుల వృద్ధి ఫండ్స్ యూనిట్ల రూపంలో ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ లో పెట్టుబడిపై వచ్చిన రాబడిలో కొంత మేర డివిడెండ్ రూపంలో ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉంటారు. డివిడెండ్ రీ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ లో ప్రకటించిన డివిడెండ్ ను ఇన్వెస్టర్ కు ఇవ్వకుండా ఆ మొత్తంతో తిరిగి యూనిట్లను కొనుగోలు చేస్తుంటారు.
Fri, Aug 04, 2017, 03:25 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View