సైనసైటిస్ నుంచి సులభంగా బయటపడదాం!
Advertisement

తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచుగా తిరగబెట్టే ఈ సమస్య రోజువారీ సాధారణ జీవితాన్ని సైతం కష్టంగా మార్చేస్తుంది. ఈ సమస్య బారిన పడిన వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏం చేయాలో నిపుణుల సూచనలను తెలుసుకుందాం.


సైనసైటిస్ అంటే?
సైనస్ అన్నవి ముక్కులో ఉండే చిన్నని కుహరములు. ముక్కు, గొంతుకకు మధ్య ఉంటాయి. ఇవి గాలితో నిండి ఉంటాయి. శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ శ్లేష్మం ముక్కు రంధ్రాల్లోంచి వచ్చే అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను అడ్డుకుంటుంది. కుహరములు కళ్ల పై భాగంలో, ముక్కు పై భాగంలో, ముక్కు గోడ వెనుక భాగంలో, చెంప ఎముకల లోపలి వైపున ఉంటాయి. నాసికా కుహరముల మధ్యనుండే కణజాలం వాచిపోవడాన్ని సైనసైటిస్ గా పేర్కొంటారు. కణజాలం వాచిపోవడంతో నాసికా కుహరములు బ్లాక్ అవుతాయి. దీంతో శ్లేష్మం, గాలి బంధించినట్టు అవుతుంది. దీనివల్ల నొప్పి, ఒత్తిడి కలుగుతుంది. కొన్ని సందర్బాల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కూడా సైనసైటిస్ కు కారణమవుతుంది.

సైనసైటిస్ సమస్యను అక్యూట్, క్రానిక్ గా పేర్కొంటారు. అక్యూట్ నాలుగు వారాల వరకు ఉంటుంది. క్రానిక్ లో వారాల నుంచి సంవత్సరాల తరబడి వేధిస్తుంది. సైనసైటిస్ సమస్య సాధారణంగా చల్లదనం, అలర్జీల వల్ల ఏర్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిలో ఫంగస్ సైతం సమస్యకు కారణమవుతుంది. ముక్కు రంధ్రాల నిర్మాణ లోపాల వల్ల కూడా క్రానిక్ సైనసైటిస్ సమస్య ఏర్పడవచ్చు. ముఖంలో ఒత్తిడి, నొప్పి, చిక్కటి రంగుతో కూడిన శ్లేష్మం సైనసైటిస్ లో కనిపించే లక్షణాలు. కొందరిలో జ్వరం కూడా రావచ్చు. తలనొప్పి కూడా కనిపిస్తుంది. మన ముక్కులు అధిక సామర్థ్యం గల ఎయిర్ ఫిల్టర్లుగా పనిచేస్తాయి. గాలిలో ఉన్న కాలుష్యాలు, దుమ్మును 80 శాతం మేర తొలగించగలవు. అతి సూక్ష్మ వెంట్రుకలు (సిలియా), మ్యూకస్ తో కలసి ఈ పనిచేస్తాయి. కుహరములు వాచిపోతే సిలియా బలహీనపడి శ్వాసపరమైన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

representational imageసైనసైటిసా? లేక అలెర్జీనా?
ముక్కులు మూసుకుపోవడం కొన్ని రోజుల పాటు ఉండి దానంతట అదే తగ్గిపోతుంటుంది. ఇది సైనసైటిసా లేక అలర్జీనా అనే విషయంలో అయోమయం కలగొచ్చు. అయితే, అలెర్జీల్లోనూ, సైనసైటిస్ సమస్యలోనూ ముక్కు, నాసికా కుహరములు ఉబ్బిపోతుంటాయి. అలెర్జీ ఉంటే అలర్జీ కారకాలను బయటకు నెట్టేయడానికి గాను ముక్కు రంధ్రాలు, కుహరములు వాచిపోతాయి. అలెర్జీలు, జలుబు వల్ల ఎక్కువగా సైనసైటిస్ సమస్య ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంటుంది.

కేవలం అలెర్జీల వల్ల అయితే ముక్కు కారడం, తుమ్ములు, కళ్ల వెంట నీరు, దురద, గురక కనిపిస్తాయి. సైనసైటిస్ లో ముక్కు రంధ్రాలు మూసుకుపోవడంతోపాటు చిక్కటి రంగుతో కూడిన  శ్లేష్మం, తల నుదిటి భాగంలో, కళ్లల్లో, చెంపల్లో నొప్పి ఉంటాయి. తలనొప్పి, పళ్ల నొప్పి కూడా అనిపించొచ్చు. ముక్కులో నాసల్ డ్రాప్స్ వేస్తే శ్లేష్మం గొంతులోకి జారడం గమనించొచ్చు. అలాగే, దగ్గు, గొంతు మంట కనిపిస్తాయి. సైనసైటిస్ సమస్యలో ముఖంలో ఒత్తిడి, నొప్పి కలుగుతాయని చెప్పుకున్నాం. రెండు కళ్ల మధ్య ముక్కు పై భాగంలో నొప్పి ఉంటుంది. ముక్కు చుట్టుపక్కల భాగాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. తల వంచితే ఈ నొప్పి ఇంకా అధికం అవుతుంది.

చికిత్స
సైనసైటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ముందు సమస్యకు దారితీస్తున్నవేంటన్నది తెలుసుకోవాలి. ఉదాహరణకు అలెర్జీ వల్ల సమస్య ఏర్పడుతుంటే లోపల ఇరుక్కుపోయిన శ్లేష్మాన్ని తీయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎక్స్ రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో సైనసైటిస్ కు కారణమవుతున్న వాటిని గుర్తించడానికి వీలుంది. సైనసైటిస్ సమస్యతో రోజుల తరబడి బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మందులు, వ్యక్తిగత శ్రద్ధతో సమస్య నుంచి బయటపడొచ్చు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా సమస్య వచ్చినట్టు డాక్టర్ గుర్తిస్తే యాంటీ బయోటిక్స్ సూచిస్తారు. వైరస్, అలెర్జీ కారకాల వల్ల సైనస్ సమస్య ఏర్పడితే దాన్ని యాంటీబయోటిక్స్ నయం చేయలేవు. కొంత మంది నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫార్మసీ స్టోర్ నుంచి ప్యారసెటమాల్, ఐబూప్రోఫెన్ వంటి మందులు తీసుకుని వాడుతుంటారు. వైద్యుల సూచన లేకుండా ఏ మందూ వాడడం సురక్షితం కాదని తెలుసుకోవాలి.

representational imageశ్లేష్మాన్ని తగ్గించేందుకు కొన్ని రకాల మందులు ఉన్నాయి. నాసల్ స్ప్రే వీటిలో ఒకటి. ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. చాలా వరకు సైనసైటిస్ నియంత్రణలో లేని అలెర్జీ కారకాల వల్లే వస్తుంటుంది. అలెర్జీ ఉన్నట్టు ఇంత వరకు నిర్ధారణ కాకపోతే పరీక్ష చేయించుకోవడం మంచిది. అలెర్జీ ఉన్నట్టు తేలితే యాంటీ హిస్టామిన్ మందుల వల్ల ఉపయోగం ఉంటుంది. దీర్ఘకాలం పాటు అలెర్జీ నివారణ మందులు వాడడం వల్ల కూడా ఉపయోగం కనిపిస్తుంది. నాసికా కుహరముల మధ్య కణజాలం వాపు తగ్గించేందుకు వైద్యులు కొన్ని కేసుల్లో స్టెరాయిడ్ మందులు సూచించే అవకాశం లేకపోలేదు.

సర్జరీ
సైనసైటిస్ సమస్యల్లో వైద్యులు కొందరికి సర్జరీ చేయించుకోవాలని సూచిస్తుంటారు. మందులు, వ్యక్తిగత శ్రద్దతో సమస్య తగ్గకపోవడం, తరచూ వస్తుండడం జరుగుతుంటే సర్జరీ చేయించుకోవడం ఓ పరిష్కారం. శస్త్రచికిత్సలో భాగంగా వైద్యులు ముక్కు రంధ్రాల్లో బ్లాక్ లను తొలగిస్తారు. అలాగే, ముక్కు రంధ్రాలను కూడా పెద్దగా చేస్తారు. దాంతో లోపలున్న శ్లేష్మాన్ని సులభంగా తగ్గించొచ్చు. తరచుగా బ్లాక్ (ముక్కు దిబ్బడ) అవడం కూడా తగ్గుతుంది.

ఈ చర్యలతో లాభం
Thu, Jul 06, 2017, 02:43 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View