మ్యారీ బిస్కెట్ తో ఘుమఘుమలాడే వంటకం... రుచిలో అదిరేను!
Advertisement

మ్యారీ బిస్కెట్ తో మంచి రుచికరమైన పిండి వంటకం తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా తక్కువ పదార్థాలే. అదెలాగన్నది చూద్దాం.


కావాల్సినవి
మ్యారీ బిస్కెట్ ప్యాకెట్ - ఒకటి
కండెన్స్ డ్ మిల్క్ 300 ఎంఎల్
నెయ్యి 2 చెంచాలు
జీడిపప్పులు ఓ 10
కావాలనుకుంటే యాలకులు, కిస్ మిస్ కూడా కలుపుకోవచ్చు.

representational imageతయారీ విధానం
మ్యారీ బిస్కెట్లను మిక్సర్ లో వేసి పొడి చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి ఆ తర్వాత మ్యారీ పొడి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. వేగిన తర్వాత కండెన్స్ డ్ మిల్క్ ను యాడ్ చేసుకోవాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునే వారు కండెన్స్ డ్ మిల్క్ ఎక్కువగా, తక్కువ కావాలనుకునే వారు తక్కువగా కలుపుకోవచ్చు. తర్వాత కడాయిలోని ఆ మిశ్రమాన్ని గరిటతో కలుపుతూ ఉండాలి. కొంత సమయానికి అది ముద్దలా మారిపోతుంది. అప్పుడు దాన్ని తీసి ఓ ప్లేట్ లోకి తీసుకుని నచ్చిన ఆకారంలోకి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కో పీస్ పై ఒక్కో జీడిపప్పు ఉంచుకోవాలి.
Wed, Jul 05, 2017, 02:31 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View