ప్రతీ మహిళ తన భర్తను అడగాల్సిన ఆర్థిక కోరికలు ఇవే...!
Advertisement
ప్రతీ కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో విలువైనది. ఇంటి ఇల్లాలి పాత్రను వేరెవరూ భర్తీ చేయలేరు. జరగరానిది జరిగితే, ఆర్థిక విపత్తులు ఎదురైతే ఇంటి ఇల్లాలు ఎంతో సతమతం అవుతుంది. ముఖ్యంగా భర్తపై ఆధారపడిన ఇల్లాలి పరిస్థితి మరింత ఇబ్బందికరం. అందుకే కుటుంబానికి ఆధారంగా ఉన్న ప్రతీ భర్త తన కుటుంబం కోసం కొన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఇల్లాలు సైతం ఈ విషయంలో అవగాహనతో ఉండాలి. భర్త మరిచినా, అలక్ష్యం చేసినా తనే శ్రద్ధ తీసుకుని తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి. అందుకే ఏం చేయాలన్నది చూద్దాం...
కుటుంబానికి ఆధారమైన భర్త అకాల మరణం చెందితే... కుటుంబ పోషకుడు పాక్షిక అంగవైకల్యం బారిన పడితే, వైద్యపరమైన సమస్యలు ఎదురైతే ఇల్లాలిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. పిల్లల విద్య, వివాహం బాధ్యతలు నెరవేర్చాలి. ఏవైనా రుణాలు ఉంటే వాటికి చెల్లింపులు, క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించాలి. లేదా గృహ రుణం, కారు, వ్యక్తిగత రుణాలుంటే అవి చెల్లించేయాలి. అందుకే ఇటువంటివి ముందే ఊహించాలి. రాకూడని ఆ సందర్భాలు వస్తే ఎదుర్కొనేందుకు వీలుగా ముందుగా చర్యలు చేపట్టాలి. ఆర్థిక భరోసాకు వీలుగా భద్రమైన భవిష్యత్తుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని భర్తను ముందుగానే కోరాల్సి ఉంటుంది. కుటుంబానికి ఆధారంగా ఉన్న వారు, భర్త స్థానంలో ఉన్న వారు కూడా ముందు చూపుతో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
అన్ని రకాల ఇన్వెస్ట్ మెంట్లు...

ప్రతీ సాధనం గురించి

నామినీగా చేర్చాలి
ఎందుకోగానీ మన సమాజంలో చాలా మంది నామినీ కాలమ్ ను ఖాళీగా వదిలేస్తుంటారు. ముఖ్యంగా వివాహమైన వారు, కుటుంబ పోషణ చూస్తున్న పురుషులు తమ పేరిట ఉన్న అన్ని రకాల పెట్టుబడి సాధనాలకు, బీమా పాలసీలకు నామినీగా భార్య పేరును రిజిస్టర్ చేయించడం ఎంతో అవసరం. బ్యాంకు ఖాతాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాల్లో, ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఇలా అన్నింటిలోనూ నామినీ పేరు పేర్కొనడం అవసరం. ఉదాహరణకు ఫిక్స్ డ్ డిపాజిట్ లో నామినీ పేరును ఇవ్వకుంటే డిపాజిట్ దారుడు కాలం చేశారనుకోండి... అప్పుడు చట్టబద్ధమైన వారసులు అన్న ధ్రువీకరణను అందజేయాల్సి వస్తుంది. ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే.
ఉమ్మడిగా బ్యాంకు ఖాతా

ఆరోగ్య బీమా

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్
కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వారి విద్య, వివాహాలు, పోషణ వ్యవహారాల బాధ్యతలు ఎవరిపై పడతాయి...? ఇల్లాలే ఇవన్నీ చూసుకోవాలి. ఇల్లాలు కూడా ఆర్జనాపరురాలైతే ఫర్వాలేదు. ఒకవేళ గృహిణిగా ఉంటే పైన చెప్పుకున్న బాధ్యతలన్నీ పెద్ద బరువుగా మారతాయి. అందుకే తాను లేకపోయినా తన కుటుంబం ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుపోకుండా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలని ఇల్లాలు సైతం తన భర్తకు సూచించాలి. అప్పుడే ఆ కుటుంబానికి రక్షణ లభిస్తుంది. టర్మ్ పాలసీ అంటే కట్టిన ప్రీమియంలను వెనక్కి ఇచ్చేది కాదు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ లభిస్తుంది.
పిల్లల కోసం పథకాల్లో పెట్టుబడులు

విల్లు రాయండి
కుటుంబానికి ఆధారమైన భర్త మరణిస్తే అతడి పేరిట ఉన్న ఆస్తులన్నీ సరైన వారి చేతికే వెళ్లాలి. ఇల్లు లేదా షాపు, బంగారం, ఆభరణాలు ఏవైనా గానీ వీటిపై కుటుంబ సభ్యులకు హక్కులుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విల్లు రాసి ఉండడం వల్ల పని సులువవుతుంది. అందుకే విల్లు రాయాల్సిన అవసరం ప్రతీ భర్తపై ఉంటుంది. అందులో తన భార్య, పిల్లల పేర్లను పేర్కొనాలి. ఈ ఆస్తులన్నవి కుటుంబ భవిష్యత్తు అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడతాయి. ఇలా విల్లు లేని సందర్భాల్లో సంబంధిత ఆస్తులపై హక్కుల కోసం న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ, ఇది సుదీర్ఘమైన కాలహరణ ప్రక్రియ అన్నది తెలిసిందే కదా.
ప్రణాళిక, పెట్టుబడులు కలసి ఉమ్మడిగా

అన్ని డాక్యుమెంట్లు
పెట్టుబడులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, అలాగే ఆస్తులు, రుణాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల గురించి ఇంటి ఇల్లాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే భర్త మరణం సందర్భంలో అవి లభించకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కీలకమైన డాక్యుమెంట్లు అన్నింటినీ ఓ ర్యాక్ లో పెట్టడం మంచిది.
పాస్ వర్డులు
పాస్ వర్డులు అన్నవి చాలా సున్నితమైనవి. చాలా కీలకమైనవి. పడరాని వారి చేతిలో పడితే పెద్ద నష్టమే కలుగుతుంది. కానీ భార్యా భర్తల విషయంలో ఇటువంటి సందేహాలు అక్కర్లేదు. పెట్టుబడులు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నప్పుడు పాస్ వర్డ్ లు ఎంతో ఉపయోగపడతాయి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి. భార్యా భర్తల మధ్య ఆర్థిక విషయాల్లో దాపరికం లేకుండా అన్నింటి గురించి సమగ్రంగా తెలుసుకోవడం, నామినిగా ఒకరికి మరొకరు వ్యవహరించడం, కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరు కర్తవ్యంగా భావించాలి.
Fri, May 05, 2017, 02:10 PM
Copyright © 2019; www.ap7am.com