మీది ఏ రకమైన జ్ఞాపకశక్తి అన్నది తెలుసా.. జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
Advertisement

మిగతా జీవ ప్రపంచం నుంచి మనుషులకు ప్రత్యేకత వచ్చింది మెదడు అభివృద్ధి చెందడం వల్లే. జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యాలే మన జీవనానికి ఆధారం. ఏదైనా అంశాన్ని నిక్షిప్తం చేసుకుని.. సమయం, సందర్భానికి తగినట్లుగా తిరిగి గుర్తు చేసుకోవడమే జ్ఞాపకశక్తి. సాధారణంగా మొక్కలు సహా అన్ని జీవరాశులకూ జ్ఞాపకశక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ అది కొన్ని రకాల జ్ఞాపకశక్తి మాత్రమే. మన మెదడు మాత్రం చాలా రకాలైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుంది. ఇందులోనూ కొంత మందికి ఒక్కో తరహా జ్ఞాపకశక్తి ఎక్కువగా, మరో తరహా జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది.

- మన నిత్య జీవిత అలవాట్లు, మన చుట్టూ ఉండే వాతావరణం, తీసుకునే ఆహారం, ఉద్యోగం, వృత్తి, చిన్నప్పటి నుంచీ పెరిగిన పరిస్థితులు వంటివి మన జ్ఞాపకశక్తి తీరును, ఏ తరహా జ్ఞాపకశక్తి అధికంగా ఉండాలన్న దానిని నిర్ణయిస్తాయి. మరి ఈ జ్ఞాపకశక్తి రకాలు, కారణాలు, లోపాలు, పెంచుకోవడానికి ఉన్న మార్గాలు, జాగ్రత్తలు వంటి విషయాలను తెలుసుకుందాం..


గుర్తు పెట్టుకోవాలనుకున్నా.. వద్దన్నా గుర్తుంటాయి
పదేళ్ల కిందట ఏం జరిగిందో గుర్తుండడం, రెండు రోజుల కింద ఎవరో కొత్తగా పరిచయం కావడం, పొద్దున ఇంట్లో బైక్ తాళం చెవులు ఎక్కడ పెట్టారో తెలియడం, పరీక్షల కోసం చదవడం.. ఇవన్నీ ఒక్క జ్ఞాపకశక్తిలో భాగమే అనుకుంటుంటాం. కానీ కొన్ని అంశాల ఆధారంగా జ్ఞాపకశక్తిని వేర్వేరుగా విభజించారు. సాధారణంగా జ్ఞాపకశక్తిని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి అని రెండు రకాలుగా చెప్పవచ్చు. రోజూ మనం చూసే, వినే, స్పర్శించే అంశాలన్నీ అప్పటికప్పుడే మెదడులో స్వల్పకాలిక జ్ఞాపకంగా నమోదవుతాయి. ఇలాంటి జ్ఞాపకాల్లో ముఖ్యమైనవి, ఇష్టమైనవి, బాధాకరమైనవి, అంత ముఖ్యమైనవి కాకున్నా తరచూ చేసే పనులు దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారుతాయి. ఉదాహరణకు మన పిల్లల పుట్టిన రోజులు ముఖ్యమైనవి కాబట్టి దీర్ఘకాలిక జ్ఞాపకంగా ఉంటాయి. సైకిల్ తొక్కడం, షూ లేసులు కట్టుకోవడం వంటి మనం రోజూ చేసే పనులు అంత ప్రధానమైనవి కాకున్నా దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మారుతాయి. తరచూ చేసే కొన్ని పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు మెదడే వాటిని దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి మార్చుతుంది.

స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ)
కొద్ది రోజుల కింది నుంచి కొద్ది నిమిషాల కింద వరకు చూసిన, విన్న, అనుభూతి చెందిన ఘటనలను గుర్తుంచుకోవడమే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి (షార్ట్ టర్మ్ మెమరీ). ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఆయా పరిస్థితులను, ప్రాధాన్యతను బట్టి గుర్తుంచుకునే సమయం మారుతుంది. ఆరోగ్య కారణాలు, గాయపడడం, కొన్ని రకాల మందులు, బాధాకరమైన, భయానకమైన ఘటనలకు లోనవడం వంటి వాటి కారణంగా కొందరికి ఈ స్వల్పకాలిక జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. దానిని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. అలాంటివారు ఎప్పుడో ఏళ్ల కింద జరిగిన వాటిని కూడా గుర్తు చేసుకోగలరు. కానీ ఐదు నిమిషాల కింద జరిగిన ఘటనలను, చూసిన అంశాలను గుర్తు చేసుకోలేరు.
ఇంప్లిసిట్ మెమరీ
మన నిత్య జీవితంలో తరచూ జరిగే, తరచూ చేసే అంశాలు ఇంప్లిసిట్ జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఏదైనా ముఖ్యమైన పనిచేస్తున్నప్పుడు మెదడు పెద్దగా దృష్టి పెట్టకుండా, విశ్లేషించకుండానే పాత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చి.. వాటికి తగినట్లుగా మనం స్పందించేలా చేస్తుంది. ఉదాహరణకు క్రీడాకారులు, ప్రొఫెషనల్ డ్రైవర్లు అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి చాలా వేగంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి మెదడు అంతకుముందటి అనుభవాలను వెంటనే గుర్తు చేసి, ప్రతిస్పందించేలా చేస్తుంది. ఇదే ఇంప్లిసిట్ మెమరీ. సుదీర్ఘకాలం ఆయా అంశాలకు దూరంగా ఉంటే అవి ఇంప్లిసట్ మెమరీ నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది.ప్రొసెడ్యురల్ మెమరీ
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంప్లిసిట్ మెమరీకి అదనమని చెప్పవచ్చు. ఇంప్లిసిట్ మెమరీ అత్యంత ప్రాధాన్య అంశాలను గుర్తుంచుకుంటే.. ప్రొసెడ్యురల్ మెమరీ అంత ప్రాధాన్యం కాని, నిత్యం చేసే పనులను నిక్షిప్తం చేసుకుంటుంది. నడవడం, మాట్లాడడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, మెట్లెక్కడం, కరెంటు స్విచ్ వేయడం, ఎవరైనా ఎదురుగా వస్తే పక్కకు తప్పుకోవడం వంటి మనం ఆటోమేటిగ్గా చేసే పనులన్నీ ఈ మెమరీలో నిక్షిప్తం అవుతాయి. మెదడు దెబ్బతిన్న పరిస్థితులలో కూడా ఈ మెమరీ నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్లే ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల మెదడు దెబ్బతిన్నవారు తమ పేరు, చిరునామా వంటివి మర్చిపోయినా.. సైకిల్ తొక్కడం, బైక్ నడపడం వంటివి చేయగలరు.
ఎక్స్ ప్లిసిట్ మెమరీ/డిక్లరేటివ్ మెమరీ
రోజూ చూసేవే, చేసేవే అయినా కొంచెం ప్రయత్నిస్తేగానీ గుర్తుకురాని జ్ఞాపకాలను డిక్లరేటివ్ లేదా ఎక్స్ ప్లిసిట్ మెమరీగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఏదైనా ఘటనలో దెబ్బతిన్న వ్యక్తి ఎవరినీ గుర్తుపట్టకపోయినా ఏ ఇబ్బందీ లేకుండా బైక్ నడుపుతారు. కానీ తను వెళ్లాల్సిన మార్గాన్ని మాత్రం రెండు మూడు సార్లు ప్రయత్నిస్తేగానీ గుర్తుకు తెచ్చుకోలేరు. ఇందులో రెండు రకాల మెమరీ ఉంటుంది. ఒకటి ఎపిసోడిక్, రెండోది సెమాంటిక్.శరీరాన్ని కాస్త శ్రమ పెట్టండి
సోమరిగా, కదలకుండా కూర్చోవడం వల్ల మెదడు మొద్దుబారిపోయి జ్ఞాపకశక్తి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తుండడం మంచిదని.. లేకపోతే రోజూ ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఫిట్ గా ఉండడంతోపాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరిమెదడు చురుగ్గా ఉండాలంటే..
Wed, Mar 01, 2017, 03:42 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View