ఒకే ఫోన్ లో రెండు వాట్సప్ లు, రెండు ఫేస్ బుక్ లు ఎలా వాడాలో తెలుసా?
Advertisement

ఇప్పుడంతా స్మార్ట్ యుగం. పొద్దున లేచినప్పటి నుంచి వాట్సప్, ఫేస్ బుక్ లేనిదే గడవని పరిస్థితి. ఇక ప్రతి వారికి రెండు మూడు ఫోన్ నంబర్లు ఉంటున్నాయి. అందులో వ్యక్తిగతంగా వాడేవీ ఉంటాయి. ఆఫీసు వ్యవహారాలను చక్కబెట్టేందుకు, ఇతరత్రా పనులకు వేరే నంబర్లు వినియోగిస్తుంటారు. మరి మన ఫోన్ లో ఏ నంబర్ తో వాట్సప్ వాడుకోవాలనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇక కొందరికి ఒకటికి మించి ఫేస్ బుక్ అకౌంట్లు ఉంటాయి. మరి వాటిని వాడడం ఎలాగనే సమస్య ఉంటుంది. ఇలాంటి సమస్యలు తీర్చేందుకు కొన్ని యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. క్లోనింగ్ యాప్ లుగా పిలిచే ఈ యాప్ లను ఉపయోగిస్తే ఒకే ఫోన్ లో ఒకేసారి రెండు వాట్సప్ లు, రెండు ఫేస్ బుక్ లను నిర్వహించుకోవచ్చు. అంతేకాదు, జీ మెయిల్ తో పాటు ఇతర గేమ్స్ వంటివి కూడా రెండు రెండు వాడుకోవచ్చు.


మూడు, నాలుగు యాప్ లుగా కూడా వాడొచ్చా...?
ఫేస్ బుక్, వాట్సప్ వంటివి మూడు నాలుగు అకౌంట్లు కూడా వినియోగించుకోవడానికి అవకాశముంది. రెండు, మూడు క్లోనింగ్ యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుని.. వాటిలో వర్చువల్ గా ఒకే యాప్ ను వేర్వేరుగా వాడుకోవచ్చు. అయితే దీనివల్ల పలు ఇబ్బందులూ ఉన్నాయి. ఫోన్ స్లో అయే అవకాశం ఉంటుంది. అందువల్ల 1.5 గిగాహెడ్జ్ ఆపైన సామర్థ్యమున్న ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ కంటే ఎక్కువగా ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఇలా వినియోగించుకోవచ్చు. అయితే నోటిఫికేషన్లు రావడం, అప్ డేట్లు వంటి అంశాల్లోనూ ఇబ్బందులు, గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. ఇలా ఎక్కువ సంఖ్యలో క్లోనింగ్ యాప్ లు, ఇతర యాప్ లతో బ్యాటరీ తొందరగా చార్జింగ్ దిగిపోతుంది.

ప్యారలల్ స్పేస్ (Parallel Space)
వాట్సప్, ఫేస్ బుక్ లు మాత్రమే కాకుండా జీమెయిల్, మెస్సెంజర్ సహా దాదాపు అన్ని రకాల యాప్ లు, గేమ్ లను కూడా అదనంగా వినియోగించుకోవడానికి ప్యారలల్ స్పేస్ యాప్ ఉపయోగపడుతుంది. ఈ తరహా యాప్ లలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫోన్ కూడా ఏ మాత్రం స్లో కాదు. దీనిని గూగుల్ ప్లేస్టోర్ లో Parallel Space అని టైప్ చేసి, సెర్చ్ చేసి.. ఇన్ స్టాల్ చేసుకోవాలి.
గో మల్టీపుల్ - ప్యారలల్ స్పేస్ (Go Multiple - parallel space)
ఇది కూడా ప్యారలల్ స్పేస్ తరహాలో అన్ని రకాల యాప్ లను క్లోన్ చేసుకుని, వినియోగించుకునేందుకు పనికివచ్చే యాప్. సోషల్ మీడియా అకౌంట్లతో పాటు గేమ్ లనూ ఇది సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ గో మల్టిపుల్ యాప్ కొంత స్లోగా ఓపెన్ అవుతుందని వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ రివ్యూల్లో పేర్కొన్నారు. అయినా ఈ యాప్ కు మంచి రేటింగే ఉంది.

ప్యారలల్ అకౌంట్స్ (Parallel Accounts)
ఇది కూడా ఇతర క్లోనింగ్ యాప్స్ తరహాలోనే పనిచేస్తుంది. అయితే ఇది వర్చువల్ గా కాకుండా నేరుగా యాప్ ను కాపీ చేసుకుంటుంది. ఈ క్లోనింగ్ యాప్ లో వర్చువల్ గా ఇన్ స్టాల్ చేసుకున్న ఇతర యాప్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోల వంటి సమాచారం ప్రత్యేకంగా ఇతర ఫోల్డర్లలో సేవ్ అవుతుంది. ఇవి కొన్ని సార్లు గ్యాలరీలో కనిపించకపోవచ్చు కూడా.

కొన్ని ఫోన్లలో ఇన్ బిల్ట్ గా...
ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొన్ని మోడళ్ల స్మార్ట్ ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టంలోనే ఇన్ బిల్ట్ గా యాప్ క్లోనింగ్ ఆప్షన్ ఉంటోంది. ఆయా కంపెనీల ఫోన్లను బట్టి ఫోన్ మేనేజర్ లోనో, సెట్టింగ్స్ లోనో ఈ క్లోనింగ్ ఆప్షన్ ను అందజేస్తున్నారు. ఆ ఆప్షన్ లోకి వెళ్లిన తర్వాత మన ఫోన్లో అప్పటికే ఇన్ స్టాల్ చేసి ఉన్న ఏదైనా యాప్ ను ఎంచుకుని.. క్లోన్ చేసుకోవచ్చు. తద్వారా రెండు అకౌంట్లను వాడుకోవచ్చు. ఇలా ఫోన్లలో వచ్చే క్లోనింగ్ ఆప్షన్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ల తరహాలో అడ్వర్టైజ్ మెంట్లు ఉండవు. వేగంగా కూడా పనిచేస్తాయి. నోటిఫికేషన్లు, అప్ డేట్లు కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాయి. బ్యాటరీ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి
Sun, Feb 26, 2017, 05:09 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View