దంతాలు పచ్చబడుతున్నాయా.. కారణాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
Advertisement

టీవీ యాడ్స్ లోనో, సినిమాల్లోనో సెలబ్రిటీల దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది దంతాలు ఎంతో కొంత పసుపు రంగులోకి మారి కనిపిస్తుంటాయి. చాలా మంది దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు కారణాలు, వాటి నుంచి బయటపడడం అనేది మన చేతిలోనే ఉంది. కొంచెం శ్రద్ధ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సమస్యల నుంచి బయటపడొచ్చు. మరి దంతాలు ఎలా ఏర్పడుతాయి, దంతాలు, చిగుళ్లకు వచ్చే సమస్యలేమిటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి వివరాలు తెలుసుకుందాం..  


దంతాల నిర్మాణం ఎలా ఉంటుంది?
మన శరీరంలోనే అత్యంత దృఢమైనవి దంతాలు. ఎముకల తరహాలో బలమైన పదార్థాలతో ఇవి ఏర్పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి.అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే అదే పరిమాణమున్న ఉక్కు కంటే ఎనామిల్ ఎక్కువ దృఢంగా ఉంటుంది.
రూట్ కెనాల్ అంటే..?
దంతంలో మనకు పైన కనిపించే భాగాన్ని క్రౌన్ అని, చిగుళ్లలోపల ఉండే భాగాన్ని రూట్ (మూలం) అని అంటారు. ఈ క్రౌన్ మధ్య భాగం నుంచి మూలం వరకు దంతం మధ్యలో నిలువుగా కాలువలా లేదా సొరంగంలా ఉండే ప్రదేశాన్ని రూట్ కెనాల్ అంటారు. ఈ రూట్ కెనాల్ లోని సున్నిత కణజాలం (పల్ప్) ద్వారానే రక్త నాళాలు, నాడులు దంతం లోపలి వరకు అమరి ఉంటాయి.

క్యావిటీలు (పిప్పి పళ్లు) అంటే..
మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్లాక్ గా మారి.. దాని నుంచి కొన్ని రకాల యాసిడ్ (ఆమ్లాలు) లు వెలువడతాయి. ఈ యాసిడ్ ల కారణంగా దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, రంధ్రాలు ఏర్పడతాయి. వాటినే కావిటీలు లేదా పిప్పిపళ్లు అంటారు. ఈ కావిటీలను నిర్లక్ష్యం చేస్తే.. చివరికి దంతాలు పూర్తిగా దెబ్బతిని, రాలిపోవడానికి కారణమవుతాయి.

పన్ను నొప్పి ఎందుకు వస్తుంది?
దంతాలు గట్టి ఎముకలే కదా మరి నొప్పి ఎందుకు వస్తుందనే సందేహం చాలా మందికి వస్తుంది. దంతాలు ఎముకతో నిర్మితమైనా.. అత్యంత దృఢంగా ఉన్నా అవి పూర్తి స్థాయి ఎముకలు కాదు. పైన ఉండే ఎనామిల్ పొర మినహా లోపల మరో రెండు పొరల జీవ కణజాలంతో దంతాలు తయారవుతాయి. ఆ కణజాలానికి రక్త నాళాలు, నాడులు అనుసంధానమై ఉంటాయి కూడా. అయితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని క్యావిటీలు (రంధ్రాలు) ఏర్పడినప్పుడు.. ఏవైనా చల్లటి లేదా వేడి పదార్థాలు తీసుకుంటే నేరుగా డెంటిన్ పొరపై, దాని లోపల ఉన్న మెత్తని కణజాలంపై ప్రభావం పడుతుంది. దానిని నాడులు గ్రహించి, మెదడుకు సంకేతాలు పంపడంతో నొప్పి కలుగుతుంది.

రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ఎందుకు?
క్యావిటీలు ఎనామిల్ పొరతోపాటు డెంటిన్ పొరకు కూడా విస్తరిస్తే.. దంతాల పరిస్థితి బాగా దెబ్బతిన్నట్లే లెక్క. దృఢమైన రెండు పొరలకు రంధ్రాలు పడడంతో లోపలి మెత్తని కణజాలం (పల్ప్)లోకి బ్యాక్టీరియా చొరబడుతుంది. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్, వాపు వస్తాయి. దాని కారణంగా తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు, దంతం లోపలి వరకు రంధ్రాలు పడి, ఇన్ఫెక్షన్ వస్తే దంతంలో పగుళ్లు వస్తాయి. ఏదైనా ఆహారాన్ని నమిలినప్పుడు ఈ పగుళ్లు కదిలి.. చిగుళ్లు, పల్ప్ పై తీవ్ర ఒత్తిడి పడి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ కు లోనైన పల్ప్ భాగాన్ని తొలగించి, రబ్బరు వంటి పదార్థంతో నింపడమే రూట్ కెనాల్ చికిత్స అంటారు.ఇన్ఫెక్షన్ సోకిన పల్ప్ ను తొలగించడం కోసం దంతానికి పై నుంచి రంధ్రం చేస్తారు. రబ్బరు వంటి పదార్థాన్ని నింపిన అనంతరం దంతానికి దృఢమైన క్యాప్ ను ఏర్పాటు చేస్తారు.

చిగుళ్ల సమస్యలు ఎందుకు వస్తాయి?
నోటిలో పెరిగే ప్లాక్ బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ల మధ్యలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అది చిగుళ్ల వాపు, నొప్పికి దారి తీస్తుంది. ఇక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్లాక్ బ్యాక్టీరియాను చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కొన్నిసార్లు బ్యాక్టీరియాకు బదులుగా చిగుళ్ల కణాలపైనా దాడి చేస్తుంది. దీనివల్ల చిగుళ్ల వ్యాధి వస్తుంది.
దంతాలు ఎందుకు పచ్చబడుతాయి?
మన దంతాలు పచ్చబడడానికి చాలా రకాల కారణాలున్నాయి. మనం తినే ఆహారం దగ్గరి నుంచి మన ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో అంశాలు దంతాలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా దంతాల పైపొర ఎనామిల్ తెలుపు రంగులో పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల ఉండే డెంటిన్ లేత పసుపు రంగులో ఉంటుంది. ఎనామిల్ మందంగా ఉంటే దంతాలు తెల్లగా కనిపిస్తాయి. సన్నగా ఉంటే పసుపు రంగులో కనిపిస్తాయి. మనలో వయసు పెరిగిన కొద్దీ ఎనామిల్ మందం తగ్గిపోతుంటుంది. దాంతో దంతాలు పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి. వీటిని ఎక్స్ ట్రిన్సిక్, ఇంట్రిన్సిక్ అని రెండు రకాలుగా చెప్పవచ్చు.దెబ్బతిన్న దంతాలకు చికిత్స ఇలా..దంతాలను రక్షించే ఆహారం
కొన్ని రకాల ఆహార పదార్థాలు నోటి శుభ్రతకు, దంతాల రక్షణకు, బలంగా ఉండడానికి తోడ్పడతాయని పరిశోధకులు గుర్తించారు. వాటిని వినియోగిస్తే దంతాల సమస్యల నుంచి కొంత వరకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
Thu, Feb 23, 2017, 04:46 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View