జుట్టు ఎందుకు రాలిపోతుంది, ఎందుకు తెల్లబడుతుంది, చేపట్టాల్సిన జాగ్రత్తలు ఇవే..!
Advertisement

మనకు జుట్టే అందం. చాలా మంది ఒత్తయిన, నల్లని నిగనిగలాడే జుట్టు కావాలనుకుంటారు. తమ జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందరో ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వాటిలో ఎంతవరకు పనిచేస్తాయన్నది అనుమానమే. 

కాలుష్యం, పోషకాహార లోపం,  వంశపారంపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల ఔషధాలు తదితర కారణాలు జుట్టు ఊడిపోవడానికి, తెల్లబడడానికి కారణాలు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అందమైన, ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది.

ఈ నేపథ్యంలో అసలు వెంట్రుకలు ఎలా పెరుగుతాయి, అవి పెరగడానికి తోడ్పడేవి ఏమిటి, వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి, ఎందుకు రాలిపోతాయి, బట్టతల ఎందుకు వస్తుంది, చుండ్రు సమస్య ఏంటి, ఈ సమస్యల నుంచి బయటపడడం ఎలా? అనే అంశాలను తెలుసుకుందాం..


వెంట్రుకలు ఎలా ఏర్పడుతాయి?
మన చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అని మూడు పొరలు ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండే హైపో డెర్మిస్ లో కొవ్వు, అనుసంధాన కణజాలం ఉంటాయి. ఇది చర్మానికి ఆధారాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇక మధ్యలో ఉండే పొర డెర్మిస్. దీనిలోనే వెంట్రుకల కుదుళ్లు (ఫాలికల్), స్వేద గ్రంధులు, రక్త నాళాలు, నాడుల చివర్లు ఉంటాయి. వీటన్నింటికీ పైన రక్షణగా ఎపిడెర్మిస్ పొర ఉంటుంది. స్వేద గ్రంథుల నాళాలు, వెంట్రుకలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకుని చర్మం పైకి వస్తాయి. వెంట్రుకల కుదుళ్లలో ఒక గ్రంథి ఉంటుంది. దానినే ఫాలికల్ గా వ్యవహరిస్తాం. ఇందులో పిగ్మెంట్ కణాలు (వర్ణ ద్రవ్యాన్ని ఉత్పత్తి చేసేవి) ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే నలుపు రంగు వర్ణ ద్రవ్యాన్నే మెలనిన్ గా వ్యవహరిస్తాం. సన్నని ట్యూబ్ లా ఉండే వెంట్రుకల్లో మెలనిన్ చేరడం కారణంగానే వాటికి నలుపు రంగు వస్తుంది.
రోజూ కొన్ని రాలిపోవడం సాధారణమే..
మన తలపై సుమారు లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. అందులో సాధారణంగానే రోజుకు సుమారు 100 వరకు వెంట్రుకలు రాలిపోతూనే ఉంటాయి. చర్మ కణాలు, వెంట్రుకల పెరుగుదల క్రమంలో ఇది నిత్యం జరుగుతూ ఉండేదే. అయితే పరిమితికి మించితేనే జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. 100 వరకు వెంట్రుకలు అంటే మనం పెద్దగా గుర్తించలేం. కానీ ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతున్నాయంటే మాత్రం కచ్చితంగా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇలా జుట్టు రాలిపోవడాన్ని ‘అలోపెసియా’ అంటారు. ఇది మెల్లమెల్లగా పూర్తి బట్టతల పరిస్థితికి దారితీస్తుంది.

వెంట్రుకల జీవితకాలం నాలుగున్నరేళ్లే..
మన తలపై ఉండే వెంట్రుకల సగటు జీవితకాలం నాలుగున్నరేళ్లు మాత్రమేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వెంట్రుక పుట్టాక నాలుగు, నాలుగున్నరేళ్ల తర్వాత కుదుళ్లతో సహా పూర్తిగా రాలిపోతుంది. మరో ఆరు నెలల్లోపే ఆ స్థానంలో కొత్త వెంట్రుక పుట్టుకు వస్తుంది. తగిన పోషకాహారం తీసుకోకపోవడం, ఇతర కారణాల వల్ల కొన్ని సార్లు కొత్త వెంట్రుకలు పుట్టడం ఆగిపోతుంది. అది చివరికి బట్టతలకు దారితీస్తుంది.

జుట్టు ఎంత వేగంగా పెరుగుతుంది?
సాధారణంగా తలపై వెంట్రుకలు ఏడాదికి 6 అంగుళాలు (15 సెంటీ మీటర్లు) పెరుగుతాయని అంచనా. దీనిని కచ్చితంగా చెప్పలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. మనలోని జన్యువుల నుంచి వాతావరణం, మనం తీసుకునే ఆహారం, కాలుష్యానికి లోనవడం, జుట్టు సంరక్షణ కోసం తీసుకునే చర్యలు వంటివి జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతాయి.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆసియన్లలో జుట్టు పెరుగుదల రేటు అందరికన్నా ఎక్కువగా ఏడాదికి 6 అంగుళాల వరకు ఉంటే.. ఆఫ్రికన్లలో చాలా తక్కువగా నాలుగు అంగుళాల వరకే ఉంటుంది.

20 ఏళ్లకే సమస్య మొదలు..
వెంట్రుకలు రాలిపోవడం, తెల్లబడడం, బట్టతల, చుండ్రు వంటి సమస్యలతో ఇటీవలి కాలంలో ఆసుపత్రులు, బ్యూటీ క్లినిక్ ల చుట్టూ తిరిగే వారి సంఖ్య చాలా పెరిగింది. ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లలో కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు కేవలం 20 ఏళ్ల వయసు యువతలోనూ కనిపిస్తున్నాయి.

కొత్త హెయిర్ స్టైల్ లు, రబ్బర్ బ్యాండ్లతోనూ సమస్యే! 
మనం కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడూ కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ ను ప్రయత్నిస్తుంటాం. ఇందుకోసం హెయిర్ రోలర్లు, స్ట్రెయిటెనర్లు, డైలు, బ్లీచ్ లు వంటి పలు రకాల రసాయన పదార్థాలను వినియోగిస్తుంటాం. వీటి వల్ల వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని.. వెంట్రుకలు రాలిపోయే సమస్య ఉత్పన్నమవుతుంది. ఒక్కోసారి కుదుళ్లు బాగా దెబ్బతిని ఆ ప్రాంతాల్లో తిరిగి వెంట్రుకలు తిరిగి పెరగని పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల కొత్త హెయిర్ స్టైల్ లను ప్రయత్నించేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణుల వద్ద మాత్రమే ప్రయత్నించాలి.
జుట్టు రాలిపోవడం, తెల్లబడడానికి కారణాలివీ..హెయిర్ డ్రయ్యర్ మరింత సమస్య
జుట్టు ఆరబెట్టుకోవడానికి వినియోగించే హెయిర్ డ్రయ్యర్లతో వెంట్రుకలు దెబ్బతిని.. రాలిపోవడం, సన్నబడడం, తెగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అప్పటికే జుట్టు రాలే సమస్య ఉన్నవారు హెయిర్ డ్రయర్ ను వినియోగిస్తే అది మరింతగా పెరుగుతుంది. సాధారణంగా వెంట్రుకలు ట్యూబ్ వంటి నిర్మాణాలు. వాటి లోపల మెలనిన్ తో పాటు స్వల్పంగా నీరు కూడా ఉంటుంది. హెయిర్ డ్రయ్యర్ తో జుట్టు ఆరబెడితే.. దాని నుంచి వచ్చే వేడి గాలికి వెంట్రుకల్లోని నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది. దీనివల్ల వెంట్రుకల్లో బుడగల్లా ఏర్పడుతుంది. దీన్నే ‘బబుల్ హెయిర్’ పరిస్థితి అంటారు. ఇది వెంట్రుకలు బలహీనం కావడానికి, గరుకుగా మారడానికి, చిక్కులు పడడానికి కారణమవుతుంది. ఇలాంటప్పుడు జుట్టు దువ్వుకుంటే.. బుడగలు ఏర్పడిన చోట వెంట్రుకలు తెగి, రాలిపోతాయి.సమస్యను గుర్తించి, నిర్ధారించేది ఇలా..
వెంట్రుకలు రాలిపోవడానికి కారణాలేమిటనేది తేల్చేందుకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు మీ మానసిక పరిస్థితిని, గత కొద్ది కాలంగా మీరు వినియోగించిన ఔషధాల వివరాలను అడిగి పరిశీలిస్తారు. సాధారణ వైద్య పరీక్షలు, ఇతర వివరాలేవీ జుట్టు రాలడాన్ని సమర్థించేలా లేనప్పుడు.. తలపై వెంట్రుకలతో కూడిన కొంత చర్మాన్ని సేకరించి (బయాప్సీ) పూర్తిస్థాయి వైద్య పరీక్షలకు పంపుతారు. తద్వారా ఆటో ఇమ్యూన్ వ్యాధులేమైనా ఉన్నాయా, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షనా అన్నది పరిశీలిస్తారు.

చికిత్సా మార్గాలు ఎన్నో?
వెంట్రుకలు రాలిపోవడం, తెల్లబడడం వంటి సమస్యలకు ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బాధితుల పరిస్థితి, అవసరాన్ని బట్టి ఏ చికిత్సలను చేపట్టాలనేది వైద్యులు నిర్ధారిస్తారు.
‘విటమిన్ హెచ్’ వాడండి
శరీరంలో వెంట్రుకలు, గోళ్లు సరిగా పెరగడానికి విటమిన్ బీ7 (బయోటిన్) తోడ్పడుతుంది. అందువల్లే దానిని హెయిర్ విటమిన్ లేదా విటమిన్ హెచ్ అని పిలుస్తుంటారు. కాలేయం, కాలిఫ్లవర్, క్యారెట్లు, అరటి, యీస్ట్, పొట్టు తీయని ధాన్యాలు, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, చికెన్ లో బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది. బయోటిన్ తగిన స్థాయిలో అందితే వెంట్రుకలు దృఢంగా, పొడవుగా పెరుగుతాయని.. సరిగా అందకపోతే సన్నబడి, సులువుగా తెగిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఉంగరాల జుట్టు (కర్లీ హెయిర్) ఎందుకు వస్తుంది?
కొందరి జుట్టు చక్కగా నిటారుగా ఉంటుంది. మరి కొందరిలో మాత్రం గింగిరాలు తిరిగే ఉంగరాల జుట్టు ఉంటుంది. వెంట్రుకలు నిటారుగా ఉండడం సాధారణమే. కానీ ఉంగరాల జుట్టుకు మాత్రం కొన్ని జన్యువులు కారణం. అలాంటి జన్యువులు ఉన్నవారిలో వెంట్రుకల కుదుళ్ల (ఫొలికిల్) ఆకారం, వెంట్రుకలు చర్మంపైకి పొడుచుకు వచ్చే కోణం కొంత విభిన్నంగా ఉంటాయి. దాంతో ఉంగరాల జుట్టు ఏర్పడుతుంది. వెంట్రుకలు నిటారుగా ఉన్నవారితో పోల్చితే ఉంగరాల జుట్టు ఎక్కువ పొడిగా ఉంటుంది.  సులువుగా తెగిపోయే లక్షణం ఉంటుంది. అందువల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.

గుండు చేసుకోవడం వల్ల వెంట్రుకలు మెరుగుపడతాయా?
Mon, Feb 20, 2017, 02:20 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View