రైస్ కంటే రోటీ మంచిదా... ఎందులో ఏమున్నాయి?
Advertisement

భారతీయులు ఎక్కువగా తీసుకునే ఆహారం బియ్యం లేదా గోధుమలు. అయితే, వీటిలో ఏది మంచిది? అన్న విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. ఒళ్లు చేసిన వారిని, బాగా లావుగా ఉన్నవారిని చూస్తే... రాత్రుళ్లు రైస్ కు బదులు రోటీ తినండని పెద్దలు సలహా ఇస్తుంటారు. మధుమేహంతో బాధపడేవారు సైతం రైస్ తగ్గించి రోటీ తింటుంటారు. అయితే, వాస్తవానికి ఏది ఆరోగ్యకరం? అన్న విషయాన్ని డైటీషియన్లు చెబుతున్న ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... 

రోటీ

గోధుమ పిండితో నూనె లేకుండా చేసుకునే రోటీలు, బియ్యం మధ్య తేడా చూస్తే... వైట్ రైస్ కంటే గోధుమ పిండిలో ప్రొటీన్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే, మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. పైగా రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. రైస్ కంటే రోటీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని తెలియనీయదు. బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహులకు ఇదే ఇబ్బందికరమైన అంశం. అదే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి.

representational image

రైస్

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్, మైక్రో న్యూట్రియెంట్లు ఎక్కువ. తక్కువ తిన్నా కడుపునిండినట్టు భావన ఉండాలని కోరుకునే వారికి బ్రౌన్ రైస్ తగినవి. పోషక విలువల పరంగా చూస్తే బ్రౌన్, వైట్ రైస్ లో పెద్దగా తేడా ఏమీ లేదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారికి ముమ్మాటికీ రోటీలే నయం. ఎందుకుంటే, గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న పదార్థాలతో రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగిపోతుంది. కనుక గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న రోటీల వంటి వాటిని తీసుకోవడం మంచిది. అలాగే బరువు పెరగకుండా ఉండాలన్నా రోటీలే తగినవి. సన్నగా ఉండి కొంచెం ఒళ్లు చేయాలని అనుకునేవారు రైస్ నిశ్చింతగా తీసుకోవచ్చు. ఒకవేళ గోధుమ పిండి అంటే నచ్చనివారు, బియ్యాన్నిఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మోతాదుల్లో తీసుకోవడం వల్ల నష్టం ఉండదు. 

మిగిలిన వారు... 

రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రోజుకు రెండు సార్లే భోజనం తీసుకోవడం... భోజనంలో ఒక రోటీని భాగం చేసుకోవడం,  ప్రొటీన్స్ తో పాటు  కాయగూరలు, ఆకు కూరలను ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది.  కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. తదుపరి తీసుకునే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా లభించేలా చూసుకోండి. దానివల్ల సమతులాహారం లభించి ఆరోగ్యంగా ఉంటారు. 

Mon, Mar 14, 2016, 09:18 PM
2018-04-11T16:46:13+05:30
2018-03-29T17:06:40+05:30
2018-03-29T15:28:09+05:30
2018-03-19T14:48:05+05:30
2018-03-16T17:04:18+05:30
2018-03-11T19:12:40+05:30
2018-03-04T18:29:51+05:30
2018-02-25T22:13:06+05:30
2018-02-25T22:00:24+05:30
2018-02-22T16:04:41+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View