ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!

13-02-2018 Tue 23:58

కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు కూడా భరించాల్సిందే. అంతేకాదు పేదలు, మధ్య తరగతి వారు ఏసీలు, మంచి కూలర్లు కొనలేరు. ఏవైనా సాధారణ, తక్కువ ధరలో దొరికే అన్ బ్రాండెడ్ కూలర్లు మాత్రమే కొంటుంటారు. తద్వారా తగిన చల్లదనం ఉండదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్దగా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే..  మన ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. వాటి వల్ల ఇంట్లో చల్లదనంతోపాటు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటి వినియోగం కూడా తగ్గుతుంది. మరి అవేమిటో తెలుసుకుందామా..?

పైకప్పుపై కోటింగ్, టైల్స్...

ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత (ఇండివిడ్యుయల్) ఇళ్లు, అపార్ట్ మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు (సీలింగ్) బాగా వేడెక్కి ఆ వేడి ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఇలా పైకప్పు వేడెక్కి ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వినియోగించడం వల్ల ఫ్యాన్ పైకప్పు వేడిని గదిలోకి విడుదల చేసి.. వేడి మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పు పైన నేరుగా ఎండ పడే ప్రాంతంలో కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించాలి.

తెర చాపలతో ఎంతో ప్రయోజనం

ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద తెర చాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా ఉంటుంది. ఈ చాపలు వేడిని అడ్డుకుంటాయి. దాంతో ఇంట్లోకి చల్లటి గాలి వీస్తుంది. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు ఏర్పాటు చేసి, వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది. 

మొక్కలు పెంచితే ఎన్నో ప్రయోజనాలు

ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం నెలకొంటుంది. అపార్ట్ మెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి, చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక ఇండివిడ్యువల్ ఇల్లు అయి ఉండి.. ఇంటి చుట్టూగానీ, ముందు, వెనుకగానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. 

మంచు గడ్డలు, నీటితో మ్యాజిక్..

 ఏసీ లేకున్నా.. ఇంట్లోని ఏదైనా గదిలో బాగా చల్లదనం కావాలనుకుంటే మంచు గడ్డలు, చల్లని నీటితో సులువుగా వేడిని తగ్గించుకోవచ్చు. ఫ్రిజ్ లోంచి తీసిన ఐస్ క్యూబ్ లను గానీ, చల్లటి నీటినిగానీ  ఏదైనా వెడల్పాటి పాత్రలో పెట్టి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా అమర్చాలి. కొద్దిసేపటిలోనే గదిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం గమనించవచ్చు. అయితే ఆ గదిలోకి బయటి నుంచి వేడి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అప్పుడు చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది.

శరీరాన్నీ చల్లగా ఉంచుకోండి

మనం ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన శరీరం వేడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. అటు ఇంటిని చల్లగా ఉంచుకునే పని చేస్తూనే.. శరీరాన్ని చల్లబరిచేందుకు చల్లటి నీళ్లు, నిమ్మరసం, జ్యూస్ ల వంటివి తాగడం బెటర్. దీంతోపాటు రుమాలు వంటి దానికి చల్లటి నీటిలో తడిపి.. శరీరంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉండే మణికట్టు, మెడ వంటి ప్రాంతాల్లో పెట్టుకోవడం ద్వారా శరీరం చల్లబడుతుంది.

త్వరలో అందుబాటులోకి కొత్త తరహా పాలిమర్

ఎండల నుంచి రక్షణ కల్పించి ఇంట్లో చల్లదనాన్ని కలిగించేలా ఇటీవలే శాస్త్రవేత్తలు కొత్త తరహా పాలిమర్ ను అభివృద్ధి చేశారు. అది సూర్యరశ్మిని చాలా వరకు పరావర్తనం చెందించే ఈ పాలిమర్ ధర కూడా తక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు సహా అన్ని చోట్లా ఈ పాలిమర్ పొరను వినియోగించుకోవచ్చు.

Advertisement 2

More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
11 months ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
2 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
2 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
2 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
2 years ago
Advertisement 3
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
2 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
2 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
2 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
2 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
2 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
2 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
2 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
2 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
2 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
2 years ago
..more
Advertisement 4