ధరలో యాపిల్ ను మించిన ఫోన్లు కూడా ఉన్నాయ్!

23-11-2017 Thu 14:23

యాపిల్ ఐఫోన్ 8ప్లస్ ధర రూ.80,000కుపైనే. ఐఫోన్లలో దీన్ని ఖరీదైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ధరే సామాన్యులు భారమని భావిస్తుంటే ఐఫోన్ కంటే చాలా ఖరీదైన ఫోన్లు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుందాం.  


వెర్టు మొబైల్స్
ఈ ప్రపంచంలో ఖరీదైన ఫోన్ల బ్రాండ్ గా ‘వెర్టు’ని చెప్పుకోవాలి. వెర్టు సిగ్నేచర్ డైమండ్ మోడల్ ఫోన్ ఈ ప్రపంచంలో అతి ఖరీదైన ఫోన్లలో ఒకటి. దీని ధర డాలర్లలో 88,000. మన కరెన్సీలో చూస్తే రూ.57.20 లక్షలు. ఎందుకింత ఖరీదనుకుంటున్నారా? ఖరీదైన ప్లాటినం లోహంతో దీన్ని తయారు చేశారు. అలాగే, విలువైన వజ్రాలను కూడా దీనిలో ఉపయోగించారు. అందుకే ధర ఆ స్థాయిలో ఉంది. కేవలం 200 పీసులనే (మొబైల్స్) వెర్టు తయారు చేసింది.

వెర్టు సిగ్నేచర్ టచ్
representational imageఈ ఏడాది ఆరంభంలో వెర్టు విడుదల చేసిన మరో మోడల్ సిగ్నేచర్ టచ్. దీని ధర డాలర్లలో 9,000. మన రూపాయిల్లో 5.85 లక్షలు. ఇది తక్కువ ధరే. ఇందులోనే గరిష్టంగా 19,000 డాలర్ల రకం కూడా ఉంది. కస్టమర్లు సొంతంగా కస్టమైజ్ చేసుకునేలా ఎనిమిది రంగుల లెదర్ కేసులతో, 16 స్టిచింగ్ ఆప్షన్లతో ఇది వస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓఎస్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ మెమొరీ, 21 మెగాపిక్సల్స్ బ్యాక్ కెమెరా, 2.1 మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా, 5.2 అంగుళాల డిస్ ప్లే ఉన్నాయి.

వెర్టు టీఐ
దీని ధర 6,49,990. 2013లోనే ఇది మన మార్కెట్లోకి విడుదలైన మోడల్. ఇందులో 1జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 1.7 గిగాహెర్జ్ ప్రాసెసర్, వెనుక 8 మెగా పిక్సల్స్, ముందు 1.3 మెగా పిక్సల్స్ కెమెరా, 3.7 అంగుళాల డబ్బ్ల్యూవీజీఏ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా ఇదేమీ గొప్ప ఫోన్ అయితే కాదు. మరి ఎందుకింత ధర అని పరిశీలిస్తే వెర్టు చేతి నిపుణులు దీన్ని ఇంగ్లండ్ లో రూపొందించారట. ఫోన్ బాడీ గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేశారు. అందుకే రేటు అంత ఘనంగా ఉంది.

వెర్టు సిగ్నేచర్ కోబ్రా
ప్రపంచంలో ఖరీదైన టాప్-10 ఫోన్లలో ఇదీ ఒకటి. దీని డిజైన్ భిన్నంగా ఉంటుంది. పేరులో కోబ్రా ఉన్నట్టు వజ్రాలు పొదిగిన పాములు ఫోన్ అంచుల్లో పడకేసినట్టు ఉంటుంది. ఫ్రెంచ్ జ్యుయెలర్ బౌచెరాన్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీని ధర 3,10,000 డాలర్లు. రూపాయిల్లో చెప్పాలంటే 2.01 కోట్లు.

ఐఫోన్ ప్రిన్సెస్ ప్లస్representational image
ఇది యాపిల్ ఐఫోన్ కంటే భిన్నంగా ఏమీ ఉండదు. ఆస్ట్రియా డిజైనర్ పీటర్ అలోస్సాన్ దీని రూపకర్త. ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 ఫోన్లలో ఇదీ ఒకటి. దీని ధర 1,76,400 డాలర్లు. సుమారు రూ.1.14 కోట్లు. బంగారం, 138 ప్రిన్సెస్ కట్, 180 బ్రిలియంట్ కట్ డైమండ్లను దీనికోసం ఉపయోగించారు. ఈ డైమండ్స్ మంచి నాణ్యమైనవి కావడం వల్లే ధర ఇంతగా పెరిగిపోయిందన్నది రూపకర్త చెప్పిన మాట.

టోనినో లంబోర్ఘిని 88 టౌరి
కార్ల కంపెనీ లంబోర్ఘిని ఉత్పత్తి ఇది. ఖరీదైన మెటీరియల్స్ తో దీన్ని తయారు చేశారు. వెండి, బంగారం పూతను వాడారు. లెదర్ స్కిన్ బాడీ. లంబోర్ఘిని కార్లకు వాడే గ్లాస్ నే ఇందులో డిస్ ప్లే కు వాడారు. ఆండ్రాయిడ్ ఓఎస్, 20 మెగా పిక్సల్స్ కెమెరా, 2.3 క్వాడ్ కోర్ క్వాల్ కామ్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్ ఉన్నాయి.

బ్లాక్ డైమండ్ వీఐపీఎన్
representational imageసోనీ ఎరిక్సన్ మోడల్ ఇది. దీనిలో రెండు వజ్రాలనే ఉపయోగించారు. ఒకటి నేవిగేషన్ బటన్ పై, మరొకటి ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. దీని ధర 3,00,000 డాలర్లు (రూ.1.95 కోట్లు).

మొబియాడో గ్రాండ్ టచ్
మొబియాడో గ్రాండ్ టచ్ ఈఎం మార్బుల్ ఫోన్ ను రాయితో రూపొందించారు. ఇందులో 4.65 అంగుళాల అమోలెడ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ, 5 మెగా పిక్సల్స్ కెమెరా ఉన్నాయి. ధర 3,100 డాలర్లు ( రూ.2 లక్షలు).

గ్రెస్సో లగ్జర్ లాస్ వెగాస్ జాక్ పాట్
దీన్ని 180 గ్రాముల బంగారంతో 2005లో స్విట్జర్లాండ్ లో రూపొందించారు. బ్యాక్ ప్యానెల్ ను 200 ఏళ్ల క్రితం నాటి ఆఫ్రికన్ బ్యాక్ వుడ్ తో రూపొందించడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపలో ఆఫ్రికన్ బ్యాక్ వుడ్ ఒకటి. దీని ధర 10 లక్షల డాలర్లు. రూ.6.5 కోట్లు. తయారు చేసింది గ్రెస్సో కంపెనీ.

గ్రెస్సో రీగల్ గోల్డ్
దీని ధర 6,000 డాలర్లు (రూ.3.9 లక్షలు). కంపెనీ రీగల్ సిరీస్ కింద విడుదల చేసిన తాజా ఫోన్. ఇందులో బంగారం, పీవీడీ కోటెడ్ టైటానియంను వినియోగించారు. 1.5 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 అంగుళాల గొరిల్లా గ్లాస్ తో కూడిన డిస్ ప్లే, 13 మెగా పిక్సల్స్, 5 మెగా పిక్సల్స్ కెమెరాలు, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ సదుపాయాలు ఉన్నాయి.

డైమండ్ క్రిప్టో స్మార్ట్ ఫోన్
దీని ధర 13 లక్షల డాలర్లు (రూ.8.45 కోట్లు). 50 డైమండ్లు ఇందులో వినియోగించారు. 10 డైమండ్లు చాలా అరుదైన బ్లూ రకానివి.

సిరిన్ సోలారిన్ క్రిస్టల్
representational imageదీని ధర 14,000 డాలర్ల (రూ.9 లక్షలు) నుంచి ప్రారంభం అవుతుంది. ఇజ్రాయెల్ కు చెందిన స్టార్టప్ కంపెనీ సిరిన్ ల్యాబ్స్ దీన్ని తయారు చేసింది. దీన్ని స్మార్ట్ ఫోన్లలో రోల్స్ రాయస్ గా అభివర్ణిస్తారు. ప్రపంచంలో అత్యంత భద్రమైన ఆండ్రాయిడ్ ఫోన్ గా దీన్ని సిరిన్ ప్రకటించింది. యూజర్ల కాల్స్, ఎస్ఎంఎస్ డేటాకు మిలటరీ గ్రేడ్ ఎన్ క్రిప్షన్ భద్రత ఉంటుందని తెలిపింది. ఇందులో 2 గిగాహెర్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్, ఎల్ టీఈ ఫీచర్లు ఉన్నాయి.

గోల్డ్ విష్ ‘లీ మిలియన్‘
ప్రముఖ డిజైనర్ ఎమ్మాన్యుయేల్ గూయిట్ దీని రూపకర్త. చాలా ఖరీదైన గడియారాలు, జ్యుయెలరీని రూపొందించిన అనుభవం ఈ డిజైనర్ కు ఉంది. స్విట్జర్లాండ్ లో దీన్ని విడుదల చేశారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ గా దీన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ధర 13 లక్షల డాలర్లు (రూ.8.45 కోట్లు). 18 క్యారట్ల బంగారం, 20 క్యారట్ల డైమండ్లతో రూపొందించిన ఈ ఫోన్ చూడ్డానికి రాజుల కత్తి పిడి మాదిరిగా ఉంటుంది.

గోల్డ్ జెనీ ఐఫోన్ 6ఎస్ ఎలైట్
దీని ధర 3,599 డాలర్లు (రూ.2.33 లక్షలు). ఐఫోన్ కు 24 క్యారట్ల బంగారం ప్లేటింగ్ తో రూపొందించారు.

గోల్డ్ విష్ ఎక్లిప్స్
ఈ ఏడాది మేలో విడుదలైన మోడల్. చేత్తో తయారు చేసింది. ఖరీదైన లోహాలను వినియోగించారు. 5.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 13 మెగా పిక్సల్స్ కెమెరా, 4కే రీజల్యూషన్ వీడియో తదితర ఫీచర్లున్నాయి. ధర 7,688 డాలర్లు (సుమారు రూ.5 లక్షలు).

ఐఫోన్ 3జీ కింగ్స్
ఇది ఐఫోన్ లో ఒక రకం. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ డిజైనర్ పీటర్ అలోయిసన్ రూపొందించారు. ఈ ఫోన్ పై 138 వజ్రాలను అలంకరించారు. 6.6 క్యారట్ల తెల్లటి వజ్రాలు ఫోన్ కు ఎంతో అందాన్ని తీసుకొచ్చాrepresentational imageయి. దాంతో ఫోన్ ధర కాస్తా 24 లక్షల డాలర్లు (రూ.15.60 కోట్లు) అయింది.

బ్లాక్ డైమండ్ ఐఫోన్
బ్లాక్ డైమండ్ ఐఫోన్ 5ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోెన్ గా చెప్పుకోవాలి. దీని ధర 15.3 మిలియన్ల డాలర్లు. మన కరెన్సీలో 99 కోట్ల రూపాయలు. స్టార్ట్ హగెస్ దీని డిజైన్ చేశారు. ఐఫోన్ 5 కు బంగారం, రత్నాలు, ఖరీదైన బ్లాక్ డైమండ్స్ ను అమర్చారు. ఇంకా 32,00,000 డాలర్ల విలువ (రూ.20.8కోట్లు) చేసే సుప్రీమ్ గోల్డ్ స్ట్రయికర్ ఐఫోన్ 3జీ, రూ.5.2 కోట్ల విలువ చేసే డైమండ్ రోజ్ ఐఫోన్ 4 మోడల్స్ కూడా వచ్చాయి.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more