పానీ పూరీ... ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు...

12-10-2017 Thu 14:58

పానీ పూరీ అంటే ఎగిరి గంతేసేవారు ఎందరో. ముఖ్యంగా చిన్నారులు ఒకసారి రుచిచూస్తే రోజూ పానీ పూరి కావాలని మారాం చేస్తుంటారు. మరి చిన్నారులు అడిగితే పెద్దలు కాదనలేరు. కానీ, వీధి పక్కన కనిపించే బండ్ల వద్ద అపరిశుభ్రతే వారిని వద్దు అనేలా చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు చక్కని పానీ పూరీ రుచి చూసేందుకు మరో మార్గం ఉంది. ఇంట్లో చేసుకోవడం. శుభ్రతకు శుభ్రత, రుచికి రుచి. మరి ఎలా చేసుకోవాలన్నది తెలుసుకోండి.


పూరి కోసం కావాల్సినవి
representational imageఒక కప్పు సుజి (గోధుమ రవ్వ) లేదా ఆటా, మూడు టేబుల్ స్పూన్ల మైదా, పావు టీ స్పూను బేకింగ్ సోడా, అర టీ స్పూను ఉప్పు, బాగా వేయించేందుకు సరిపడా వంట నూనె.

పానీ కోసం
అర కప్పు చింతపండు గుజ్జు, రెండు కప్పుల నీరు, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర, అర కప్పు కొత్తిమీర ఆకులు (వద్దునుకుంటే మినహాయించుకోవచ్చు), మూడు పచ్చి మిరపకాయలు, ఒక కప్పు పుదీనా ఆకులు (వద్దనుకుంటే మినహాయించుకోవచ్చు), ఒక టేబుల్ స్పూన్ కాలా నమక్ (ఉప్పులో ఒక రకం) సిద్ధం చేసుకోవాలి.

స్టఫ్ కోసం (పూరీలో పెట్టేందుకు)
representational imageరెండు బంగాళాదుంపలు, రెండు తరిగిన పచ్చి మిరపకాయలు, పరిమాణాన్ని బట్టి ఒకటి లేదా రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, రుచి కోసం కాస్తంత ఉప్పు, తరిగిన కొత్తిమీర అవసరం.

పూరీ తయారీ విధానం
ఒక పాత్ర తీసుకుని అందులో సుజి లేదా ఆటా వేసి, కాస్తంత ఉప్పు వేసి, వేడి నీరు పోసి బాగా కలిపిన తర్వాత 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని చాలా చిన్న పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. వీటిని పూరీల్లానే వత్తి, పొయ్యిపై వేడెక్కిన నూనెలో బంగారు వర్ణంలో వేయించుకోవాలి.
 
పానీ తయారీ
మిక్సర్ లో కొత్తి మీర, పుదీనా, పచ్చి మిరపకాయలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి నీటిని కలుపుకోవాలి. తర్వాత పానీకి సంబంధించి ఇతర ముడి పదార్థాలను కూడా కలపాలి. మీ రుచికి అనుగుణంగా కొన్ని ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.

పూరీలోకి స్టఫ్ తయారీ
representational imageబంగాళాదుంపలను ఉడకబెట్టి దించేయాలి. వీటిని గుజ్జుగా చేసి పొయ్యిపై పెనం పెట్టి కాస్తంత నూనె వేసి ఈ మిశ్రమంలో తరిగిన పచ్చి మిరపకాయలు, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి గరిటెతో కలియబెడుతూ వేడెక్కిన తర్వాత దించేయాలి. దీంతో స్టఫ్ రెడీ. 


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more