మ్యూచువల్ ఫండ్స్ పైనా రుణం తీసుకోవచ్చు... ఇలా!

23-08-2017 Wed 13:03

రుణం తీసుకోవాలంటే ఒకప్పుడు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. హామీలు, పూచీకత్తులు ఇలా ఎన్నో అవసరమయ్యేవి. రోజుల తరబడి రుణాల కోసం తిరగాల్సి వచ్చేది. కానీ, నేడు రుణం తీసుకునేందుకు ఎన్నో మార్గాలు, ఎన్నో అవకాశాలున్నాయి. అందులో మ్యూచువల్ ఫండ్స్ పై రుణం కూడా ఒకటి. మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అమ్మే పని లేకుండా వాటి సాయంతో సులభంగా రుణం పొందొచ్చు మరి.


దీర్ఘకాలంలో మంచి రాబడుల కోసం, లక్ష్యాల సాధన కోసం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఫండ్స్ లో పెట్టుబడులు వెనక్కి తీసుకునే వారూ ఉన్నారు. ఇలా చేస్తే ఏ లక్ష్యం కోసమైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి విఘాతం ఏర్పడుతుంది. ఆ అవసరం లేకుండా మ్యూచువల్ ఫండ్స్ పై రుణం తీసుకోవడం ద్వారా అవసరాన్ని గట్టెక్కవచ్చు. పెట్టుబడులకు విఘాతం కూడా కలగదు. సిప్ రూపంలో ఫండ్స్ లో పెట్టుబడులనూ ఆపాల్సిన పనిలేదు.

representational imageతనఖా పెట్టుకుని రుణం
ఎక్కువ మందికి సాధారణంగా మూడు నెలల నుంచి ఏడాది కాలం కోసమే రుణాలు అవసరమవుతాయి. అలాంటప్పుడు మీ దగ్గరున్న మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టడం ద్వారా రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని (ఎన్ బీఎఫ్ సీ) అయినా ఆశ్రయించొచ్చు. స్వల్పకాలిక అవసరాల కోసం ఓవర్ డ్రాఫ్ట్ మాదిరిగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం తీసుకోవచ్చు. రుణంపై వడ్డీ రేటు ఎంతన్నది ఎంత రుణం తీసుకుంటున్నారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 10-11 శాతం మధ్య వడ్డీ రేటు ఉంది. తనఖా పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల విలువలో 60 శాతం వరకూ రుణంగా పొందడానికి అవకాశం ఉంది. తనఖా పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై హక్కులు రుణదాతలకు బదిలీ అవుతాయి. దీంతో రుణం తీర్చేవరకూ తిరిగి ఆ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు విక్రయించేందుకు, బదిలీ చేసేందుకు అవకాశం ఉండదు. డెట్ ఫండ్స్ కాకుండా ఈక్విట ఫండ్స్ పైనే రుణం తీసుకోవడం సముచితం.

ఎక్కడ తీసుకోవాలి...?
ఆన్ లైన్ వేదికలు సైతం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను డీమ్యాట్ రూపంలో కలిగి ఉంటే వాటిని తనఖా పెట్టేందుకు ముందస్తు అనుమతి ఉండాలి. అదే ఫిజికల్ రూపంలో ఉంటే రుణదాతతో ముందస్తుగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో రుణమిచ్చే సంస్థ మ్యూచువల్ ఫండ్స్ రిజిస్ట్రార్ అయిన కామ్స్ (సీఏఎంఎస్) లేదా కార్వీ సంస్థను సంప్రదిస్తుంది. ఫలానా ఫోలియో నంబర్ తో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ను తనఖా పెట్టినట్టు, వాటిన లీన్ లో ఉంచాలని కోరుతుంది. దీంతో సంబంధిత యూనిట్లను లీన్ కింద ఉంచుతారు. రుణదాతకు, ఇన్వెస్టర్ కు ఈ విషయాన్ని తెలియజేస్తూ లేఖను కూడా పంపడం జరుగుతుంది.

representational imageరుణం తీర్చివేస్తే...
రుణం తీర్చివేసిన తర్వాత రుణమిచ్చిన సంస్థే సంబంధిత మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను స్వాధీనం నుంచి విడుదల చేయాలని రిజిస్ట్రార్ ను కోరుతుంది. అవసరమైతే రుణం కొంత మేర తీర్చివేసిన తర్వాత ఆ మేరకు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల పార్షిక స్వాధీన విముక్తి కోసం కూడా లేఖ రాసేందుకు అవకాశం ఉంది.

రుణం తీర్చడంలో విఫలమైతే...?
రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్ బీఎఫ్ సీ సంస్థ తనఖాగా ఉంచిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను స్వాధీనం చేసుకుంటుంది. వాటిని రిడీమ్ చేసుకునేందుకు దరఖాస్తు పంపుతుంది. అప్పుడు ఫండ్స్ హౌస్ ఆ యూనిట్లను విక్రయించి సంబంధిత రుణదాతకు చెక్ పంపుతుంది.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more