నిద్రలో గురక పెడుతున్నారా?

18-08-2017 Fri 06:09

నిద్రలో గురక సమస్య ఉందా...? అయితే ఓ సారి ఆలోచించాల్సిందే! అరుదుగా ఏ ఒకటి, రెండు నిమిషాలో అయితే ఆందోళన అక్కర్లేదు గానీ, ప్రతి రాత్రి గురక సాధారణంగా మారితే కచ్చితంగా ఓ సారి వైద్యులను సంప్రదించడమే మంచిది. ఎందుకంటే దాని వెనుక ఏముందో ఎవరికి తెలుసు?


గురక నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. దాంతో నిద్రలో శరీరానికి, మనసుకు అసలైన విశ్రాంతి ఉండదు. గురక పెట్టేవారి కంటే, పక్కనున్న వారికీ ఇబ్బంది ఎంతో. గురక శబ్ధానికి భయపడి వారి సమీపంలో నిద్రించేందుకు వెనుకాడొచ్చు. మరి గురక లేకుండా నిద్రించడం ఎలాగన్నది, అందుకు ఏం చేయాలన్నది వైద్య నిపుణుల సూచనల ద్వారా తెలుసుకుందాం.

గురక ఎందుకొస్తుంది?
నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. అలాగే, ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. కానీ, వాస్తవంలో మరెన్నో అంశాలు, సమస్యలు గురకకు కారణం కావచ్చు. అవేంటన్నది తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది పరిష్కారమయ్యే సమస్యే గనుక.

representational imageనోటి ద్వారా శ్వాస
సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అవాంతరాల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే.

వయసు
మధ్య వయసు, ఆపై వయసుకు వచ్చిన తర్వాత గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది.

అధిక బరువు
మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. అధిక బరువు ఉండడం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది.

నాసల్, సైనస్ సమస్యలు
సైనస్ సమస్యలో ముక్కు నాసికా కుహరములు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది.

ఆల్కహాల్, ఔషధాలు
మద్యం, పొగతాగడం, ట్రాంక్విలైజర్ ఔషధాలైన లోరజ్ పామ్, డైజిపామ్ కండరాలకు పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి. దానివల్ల కూడా గురక రావచ్చు.

representational imageనిద్రా భంగిమ
పడుకునే తీరు సరిగా లేకపోయినా ఈ సమస్యకు కారణం కావచ్చు.  

మెడ నిర్మాణం
మెడ భాగం మందంగా ఉన్న వారిలో, అలాగే లావుగా ఉండి, మెడ సన్నగా ఉన్న వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది.

తీవ్ర సమస్యలు
తరచుగా గురక పెడుతున్న వారు అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. స్లీప్ ఆప్నియా అనేది తీవ్రమైన నిద్ర రుగ్మత. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో దీర్ఘ అవరోధాలు, తరచూ నిద్ర నుంచి మేల్కొనడం, గాఢ నిద్ర లేకపోవడం వంటివి రావచ్చు. దీర్ఘకాలంగా గురక కొనసాగుతుంటే రక్తపోటు పెరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల గుండె ఎన్ లార్జ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. గురక వల్ల సరిగ్రా నిద్ర ఉండదు. దీనివల్ల కూడా పలు అనారోగ్య సమస్యలు రావచ్చు. సరైన ఆక్సిజన్ ను తీసుకోలేని స్థితి వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీంతో పల్మనరీ హైపర్ టెన్షన్ సమస్య బారిన పడతారు. అలాగే, దీర్ఘకాలం పాటు తలనొప్పి, స్థూలకాయం, అలసట, పగలు నిద్రించడం వంటివి ఉంటాయి. గురక చాలా పెద్ద శబ్దంతో వస్తూ, పగటి పూట నిద్రిస్తుంటే దాన్ని స్లీప్ ఆప్నియాగానే పరిగణించాలి. లేదంటే శ్వాస తీసుకోవడంలో పెద్ద సమస్య ఏదో ఉందని భావించాల్సి ఉంటుంది. స్లీప్ ఆప్నియాతో గుండెకు చేటు.

representational imageచిన్నారుల్లోనూ...
చిన్నారుల్లోనూ గురక సమస్య కనిపిస్తుంటుంది. ఓ అంచనా ప్రకారం ప్రతీ 100 మంది పిల్లలలో 15 మందిలో ఇది కనిపిస్తుంది. గొంతు ద్వారా వెళ్లే శ్వాసమార్గంలో అవాంతరాలు, కుచించుకుపోవడం, సరిగా నిర్మాణం కాకపోవడం ఈ విధమైన కారణాల వల్ల రావచ్చు. అలర్జీలు, గొంతు భాగంలోని టాన్సిల్స్ వాయడం వల్ల కూడా గురక వస్తుంది. ఎక్కువ మంది పిల్లలలో టాన్సిల్స్ వాపే ఈ సమస్యకు కారణం. నెలలు నిండక ముందు పుట్టే పిల్లల్లో, అధిక బరువుతో ఉన్న వారిలోనూ ఇది కనిపించొచ్చు. పిల్లలు నిద్రలో తరచూ కదులుతుంటే, ఛాతీ కదలికలు అసాధారణంగా ఉంటే, గురక పెడుతుంటే వారిలో శ్వాసపరంగా అవాంతరాలున్నట్టు అర్థం చేసుకోవాలి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే గురక అన్నది పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి.

గుర్తించడం ఎలా?
గురక సమయంలో వీడియో, ఆడియా రికార్డు చేసి దాన్ని వైద్యులకు చూపిస్తే సమస్యను గుర్తించడం సులభం అవుతుంది. అలాగే, పల్స్ ఆక్సిమెట్రీ సాయంతో  రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోతే గురక నుంచి బయటపడేందుకు పలు మార్గాలను సూచించొచ్చు. సమస్య ఉన్నట్టు గుర్తిస్తే అప్పుడు మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా సమస్యను సరిచేస్తారు. నోరుమూసి గురక పెడుతుంటే నాలుక కారణంగా గురక వస్తుందని... నోరు తెరిచి గురక పెడుతుంటే గొంతు కండరాల వల్ల, వెల్లకిలా పడుకున్నప్పుడు చిన్నగా గురక పెడుతుంటే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఏ విధంగా పడుకున్నాగానీ గురక వస్తుంటే అందుకు చికిత్స అవసరం.

సొంతంగా నివారణ
కొన్ని రకాల టెక్నిక్కులు, జీవన విధానంలో మార్పులతో గురక సమస్యను తగ్గించుకోవడం, దాన్నుంచి బయటపడడం సాధ్యమే.
representational imageవ్యాయామాలువైద్యపరంగా ఆధునిక చికిత్సా విధానాలు వచ్చేశాయి. గురక సమస్య తగ్గదన్న అభిప్రాయాన్ని విడిచిపెట్టి వెంటనే చెవి, గొంతు, ముక్కు డాక్టర్ ను సంప్రదించాలి. కొన్ని రకాల పరికరాలు, మందులు వీటిలో ఏదైనా సూచించే అవకాశం ఉంది. సైనస్, టాన్సిల్స్ వల్ల గురక వస్తుంటే శస్త్రచికిత్స ద్వారా అయినా సమస్యను సరిచేయవచ్చు. దీర్ఘకాలంగా గురకతో బాధపడుతుంటే స్లీప్ ఆప్నియా సమస్య ఉందని గుర్తిస్తే దాన్ని నయం చేసేందుకు మందులు సూచిస్తారు. గుండెకు సంబంధించి కూడా పరీక్షలు చేసి చూస్తారు. నిజానికి గురక బయటకు కనిపించే లక్షణం. ఏం కాదులే అని నిర్లక్ష్యం తగదు. దాని మూలాన్ని, ఎందుకు వస్తుందో కారణాన్ని గుర్తించాలి. దానివల్ల అరుదుగా గుండె జబ్బులు, ఇతర ఇబ్బందులు బయటపడే అవకాశం ఉంది. అందుకే ఓ సారి వైద్యులను సంప్రదించి సమగ్ర పరీక్షలు చేయించుకోవడం మంచిది.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more