వాట్సాప్ లో కంటెంట్, ఫొటోలు షేర్ చేస్తున్నారా...? టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసా...?

19-07-2017 Wed 14:38

వాట్సాప్ కుటుంబంలో 20 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. నిత్యం వందలాది మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలు, ఇతర కంటెంట్ షేర్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. రోజులో నిద్ర సమయం మినహా మిగిలిన సమయమంతా వాట్సాప్ సాయంతో ఇతరులతో టచ్ లో ఉంటూ షేరింగ్ ప్రపంచంలో తేలియాడే వారు కంపెనీ నియమ నిబంధనలు తెలుసుకోవడం ఎంతో అవసరం. అందులోనూ ఏది పడితే అది మూడో కన్ను చూడదులే అని షేర్ చేసుకోవడం ఎంత మాత్రం భద్రత కాదు.


వాట్సాప్ ను వినియోగించాలంటే మైనారిటీ తీరాలి. అమెరికాలో 13 ఏళ్లు ఆ పైన ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. మిగిలిన దేశాల్లో స్థానిక చట్టాల ప్రకారం ఇది ఉంటుంది. మన దేశంలో 18 ఏళ్లు. వాట్సాప్ లో ఏది షేర్ చేసుకుంటున్నా వాటిపై యూజర్లకు హక్కులు తప్పనిసరిగా ఉండాలి. చట్ట విరుద్ధమైనవి, అసభ్యకరమైనవి, అఫఖ్యాతి పాల్జేసేవి, బెదిరింపులు, భయపెట్టడం, వేధించడం, జాతి వివక్ష, బాధపెట్టడం, ద్వేషించడం, చట్టవిరుద్ధమైన చర్యలకు ప్రేరేపించడం ఈ విధమైన చర్యలన్నీ వాట్సాప్ వేదికగా నిషేధం. స్టేటస్, ప్రొఫైల్ ఫొటోలు, మెస్సేజ్ లలో వీటికి చోటు లేదు. వీటిని గుర్తిస్తే సంబంధిత ఖాతాను నిషేధించే అధికారం తమకు ఉందని వాట్సాప్ పాలసీ చెబుతోంది. వాట్సాప్ లో యూజర్ల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేందుకు నియమ, నిబంధనలను పాటించాలని వాట్సాప్ కోరుతోంది. ఇందుకోసం కంట్రోల్ టూల్స్ ను కూడా అందుబాటులో ఉంచింది. చేయాల్సిందిల్లా యూజర్లు సెట్టింగ్స్ లోకి వెళ్లి కంట్రోల్స్ పెట్టుకోవడమే.

బ్లాక్ చేయడం
వాట్సాప్ వేదికగా మీతో సంప్రదింపులు జరపకుండా ఏ కాంటాక్ట్ ను అయినా బ్లాక్ చేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు ఆ కాంటాక్ట్ ను అన్ బ్లాక్ చేసుకోవచ్చు. బ్లాక్ చేస్తే సంబంధిత వ్యక్తి ఏ సమాచారాన్ని పంపినప్పటికీ అది మీ ఫోన్ ను చేరదు. మీరు ఆన్ లైన్లోకి చివరి సారిగా ఎప్పుడు వచ్చారు? తదితర సమాచారం వారికి కనిపించదు. స్టేటస్ అప్ డేట్స్ కూడా తెలియవు. మీ ప్రొఫైల్ ఫొటో సహా వారికి మీ సమాచారం ఏదీ కనిపించదు. అదే సమయంలో బ్లాక్ చేసిన కాంటాక్ట్ కు మీరు కాల్ చేయడం, మెస్సేజ్ చేయడం కూడా కుదరదు.

మీరు చివరిసారిగా ఎప్పుడు వాట్సాప్ చూశారు, ప్రొఫైల్ ఫొటోలో దేన్ని ఉంచారు... ఈ విధమైన సమాచారాన్ని మీ కాంటాక్టు లిస్ట్ లో ఉన్న వారందరూ చూడొచ్చు. ఇందుకు సంబంధించి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. మీస్టాటస్ ను ఎవరు చూసినా ఫర్వాలేదనుకుంటే ఎవ్రీవన్ ఎంపిక చేసుకోవాలి. ఎవరూ చూడకూడదు అనుకుంటే నోబడీ ఆనే ఆప్షన్ ఉంది. మీ స్టేటస్ ఇతర సమాచారం ఇతరులు చూడకూడదని కోరుకుంటే, ఇతరుల స్టేటస్ వివరాలను కూడా మీరు చూడలేరు.

representational imageషేరింగ్
వాట్సాప్ వేదికగా షేర్ చేసుకున్న సమాచారం, ఫొటోలు ఏవైనా గానీ వాటిని వాట్సాప్ స్టోర్ చేయదు. డెలివరీ అయిన తర్వాత వాట్సాప్ సర్వర్లు వాటిని డిలీట్ చేసేస్తాయి. ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ అంటే పంపిన వారి నుంచి అందుకున్న వారి వరకూ మధ్యలో ఎవరూ వాటిని చూడకుండా సంకేతాలుగా మారి పంపిణీ అవుతాయి. కాకపోతే మీ నుంచి అందుకున్న వారి దగ్గర మాత్రం అవి ఉంటాయి. దీంతో వారు వాటిని వాట్సాప్ సాయంతో ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరుంటున్న లొకేషన్ ను సైతం తెలియజేయవచ్చు. అయితే, పైన చెప్పుకున్నట్టు నిషేధిత కంటెంట్ లో ఏదైనా గానీ గుర్తిస్తే వాట్సాప్ కు పిర్యాదు చేయవచ్చు.

స్పామ్, హోక్సెస్
మొదటి సారి ఓ వ్యక్తి నుంచి మెస్సేజ్ వచ్చినప్పుడు రిపోర్ట్ స్పామ్, బ్లాక్, యాడ్ టు కాంటాక్ట్స్ అని మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఓ ఆప్షన్ ను ఎంచుకుని ముందుకు వెళ్లడమే. వాట్సాప్ కు సంబంధించి మీ కాంటాక్ట్ నంబర్ అవతలి వారి వద్ద ఉంటే మిమ్మల్నినేరుగా సంప్రదించే వీలుంది. సాధారణంగా స్పామ్ మెస్సేజ్ లు అన్నవి మీ కాంటాక్టుల నుంచి కాకుండా అపరిచిత నంబర్ల నుంచే వస్తుంటాయి.
గుర్తించలేకపోవచ్చు..
ఇంటర్నెట్ సాయంతో వాట్సాప్ ద్వారా పంపినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని స్పామ్ లు ఫోన్ లో తిష్ట వేసుకుని ఉంటే మీ సమాచారం అపరిచితులను చేరుతుంది. అందుకే ఏవి పడితే అవి క్లిక్ చేయరాదు. ఏ సమాచారం అయినా మీ ప్రాణాలకు ప్రమాదకరమని భావిస్తే, పోలీసులను ఆశ్రయించాలని వాట్సాప్ సూచిస్తోంది.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
2 years ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
4 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
4 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
4 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
4 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
4 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
4 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
4 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
4 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
4 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
4 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
4 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
4 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
4 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
4 years ago
..more