మన చుట్టూ ఉన్న రైస్ వెరైటీస్ ఇవే!

24-06-2017 Sat 13:21

ప్రపంచానికే అన్నపూర్ణ భారతదేశం. ఒకప్పుడు మన దేశంలో 1,10,000 రకాల బియ్యం పండేవి. నేడు అవి 6,000కు తగ్గిపోయాయి. మారుతున్న పరిస్థితుల్లో రైతులు అధిక దిగుబడి నిచ్చే రకాలకే పరిమితమవుతున్నారు. దీంతో బియ్యం వెరైటీలు తగ్గుతూ వస్తున్నాయి. ఎన్ని వెరైటీలున్నా... అత్యధికులు వాడేవి వైట్ రైస్. వీటితో పాటు వాడుకలో ఉన్న ఇతర బియ్యం రకాల్లో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం.


వైట్ రైస్
వైట్ రైస్ తేలిగ్గా జీర్ణమయ్యే రకం. తిన్న తర్వాత దండిగా, శక్తినిచ్చేదిగా ఉంటుంది. ఇందులో పిండి పదార్థాలు ఎక్కువ. మన శరీరానికి ఎక్కువగా కార్బొహైడ్రేట్లు అవసరం. వైట్ రైస్ లో ఇవి పుష్కలం. ఫైబర్ తక్కువ. సులభంగా, వేగంగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత జీర్ణమయ్యేందుకు గంట సరిపోతుంది. అందుకే చిన్నారులకు దీన్నే పెట్టాలని సూచిస్తుంటారు. అలాగే పెద్ద వయసు వారికి కూడా ఇదే సులభమైన ఆహారం. నిజానికి వైట్ రైస్ అంటే పాలిష్డ్ చేసిన బియ్యం. మిల్లింగ్ లో బియ్యం పై పొరలను తొలగించడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లలో చాలా వరకు కోల్పోవడం జరుగుతుంది. వైట్ రైస్ ను శుద్ధి చేసిన పిండి పదార్థంతో సమానమంటారు.

representational imageబ్రౌన్ రైస్
బలవర్ధకమైన, పోషకాలు అధికంగా ఉండే రకం బ్రౌన్ రైస్. విటమిన్లు, మినరల్స్ పుష్కలం. వీటిలో కేలరీలు తక్కువ, ఫైబర్ (పీచు) ఎక్కువ. దీని వల్ల తిన్న తర్వాత వైట్ రైస్ మాదిరిగా వెంటనే అరిగిపోయి కార్బొహైడ్రేట్లు రక్తంలో చేరిపోవు. నిదానంగా జరిగే ప్రక్రియ వల్ల రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. ఈ రకం బియ్యంలో ఉండే సహజ నూనె చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సాయపడుతుంది. మంచి ఆరోగ్యం కోరుకునే వారికి ఈ వెరైటీ తగినది. ఇతర వెరైటీలతో పోలిస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. బ్రౌన్ రైస్ లో కేవలం పైన ఉండే పొట్టును మాత్రమే తొలగిస్తారు. కనుక బియ్యంలో ఉండే ఏ పోషకమూ కోల్పోవడం జరగదు. అందుకే బ్రౌన్ రైస్ ఉడికేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పైగా జీర్ణమయ్యేందుకు  కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే మన దగ్గర తక్కువ మందే దీన్ని తింటుంటారు.

రెడ్ రైస్
ఈ రకం బియ్యం తినడానికి రుచికరంగా ఉండవు. కానీ, పోషకాలు సమృద్ధిగా లభించే రకం ఇవి. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలనుకునే వారికి రెడ్ రైస్ కూడా ఓ ఆప్షన్. ఈ రైస్ వల్ల ఇనుము లోపం ఉండదు. రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. వీటిలో విటమిన్ బీ6 కూడా సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ బీ6 అన్నది సెరటోనిన్ ఉత్పత్తికి, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడేది. అంతేకాదు, డీఎన్ఏ కణాల ఉత్పత్తికీ సాయపడుతుంది. రెడ్ రైస్ కు సంబంధించి పలు వెరైటీలున్నాయి. మన దగ్గర లభించేవి హిమాలయ రెడ్ రైస్. హిమాలయ రాష్ట్రాల్లో, నేపాల్, భూటాన్ దేశాల్లో పండే రకం. పొడవుగా ఉండి, లైట్ ఎరుపు రంగులో ఉంటుంది. బాస్మతి బియ్యానికి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతుంటారు.

బ్లాక్ రైస్
అల్జీమర్స్, డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారికి బ్లాక్ రైస్ చక్కని ఆప్షన్. మన దేశంలో లభించే బియ్యం రకాలతో పోలిస్తే బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ గుణాలు మరే రకంలోనూ లేవు. థాయ్ ల్యాండ్ దేశంలో ఈ వెరైటీని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో మాత్రం తమిళనాడులోని చెట్టినాడ్ ప్రాంతంలో కూడా ఇది కొంత మేర సాగవుతుంది. చెట్టియార్ కమ్యూనిటీ ప్రజలు వీటిని ఉపయోగిస్తుంటారు.

representational imageబాస్మతి రైస్
మన దేశంలో లభించే ఇతర వెరైటీల కంటే బాస్మతి రకం బియ్యంలో పీచు భాగం 20 శాతం అధికం. బాస్మతి రైస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ మోస్తరుగా ఉంటుంది. దీనివల్ల డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనం. వైట్ రైస్, బ్రౌన్ రైస్ మాదిరిగానే.... బాస్మతీ బియ్యంలోనూ పాలిష్ పట్టని బ్రౌన్ రకం, బాగా మిల్లింగ్ చేసిన వెరైటీలున్నాయి. బాస్మతి బియ్యానికి ప్రత్యేక పరిమళం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 2 అసెటిల్ 1 పైరోలిన్ అనే కెమికల్ ఉండడం వల్లే. బాస్మతి రైస్ కు మన దేశమే ఫేమస్. అమెరికాలో ఈ వెరైటీని పండిస్తున్నప్పటికీ మన దేశం ఉత్పత్తి చేసే బియ్యంతో పోలిస్తే నాణ్యత తక్కువ. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో భారత బాస్మతి బియ్యానికి డిమాండ్ చాలా ఎక్కువ.  

జాస్మిన్ రైస్
ఈ బియ్యంలో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఇది బాస్మతి బియ్యం మాదిరే ఉంటుంది. థాయ్ ల్యాండ్ లో పండే రకం ఇది.

వైల్డ్ రైస్
బ్రౌన్ రైస్ తో పోలిస్తే వైల్డ్ రైస్ లో ప్రొటీన్లు ఎక్కువ. కార్బొహైడ్రేట్లు తక్కువ. విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్, ఒమేగా ఫ్యాటీ3 యాసిడ్స్ లభిస్తాయి. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వెరైటీని సాగు చేస్తారు.

representational imageబ్రౌన్ రైస్, వైట్ రైస్ మధ్య తేడా
రెండింటిలోనూ కార్బొహైడ్రేట్లు ఎక్కువే. కాకపోతే బ్రౌన్ రైస్ అన్నది బియ్యంపై పొట్టు తప్ప మరే భాగమూ తొలగించనిది. ఇందులో బ్రాన్, జెర్మ్ అలానే ఉంటాయి. దీంతో వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ తిన్న వారిలో కార్బొహైడ్రేట్లు అన్నవి వెంటనే రక్తంలో కలిసిపోకుండా నిదానంగా కలుస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి. దీనివల్ల స్ట్రోక్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గిపోతుంది. సాధారణంగా పురుషులు అయితే 50 ఏళ్ల లోపు వయసున్న వారికి రోజుకు 38 గ్రాముల ఫైబర్ అవసరం, అదే 50 ఏళ్లపైన వయసున్న వారికి రోజుకు 30 గ్రాముల ఫైబర్ కావాల్సి ఉంటుంది. మహిళల్లో ఇది 25, 21 గ్రాముల మేర కావాల్సి ఉంటుంది. బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ.
representational imageమాంగనీస్: ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు, యాంటీ ఆక్సిడెంట్ల ఫంక్షన్ కోసం మాంగనీస్ అవసరం. కానీ, వైట్ రైస్ లో ఇది ఉండదు. బ్రౌన్ రైస్ లో సమృద్ధిగా లభిస్తుంది.
సిలీనియం: ఇది కూడా బ్రౌన్ రైస్ లో తగినంత లభిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, యాంటీ ఆక్సిడెంట్ల ఉత్పత్తి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో దీనిది కీలక పాత్ర.
మెగ్నీషియం: వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం తగినంత ఉంటుంది. ఎముకల పటిష్ఠతకు, కణాల ఉత్పత్తికి, కండరాల సంకోచానికి, రక్తం గడ్డకుండా చూసేందుకు ఇది చాలా అవసరం.  

పోషకాలు (45 గ్రా ఉడికిన రైస్)
బ్రౌన్ రౌస్
వైట్ రైస్
శక్తి
170 కేలరీలు
160 కేలరీలు
ప్రొటీన్లు
4 గ్రాములు
3 గ్రాములు
టోటల్ ఫ్యాట్
1.5 గ్రాములు
0
కార్బొహైడ్రేట్లు
35 గ్రాములు
36 గ్రాములు
ఫైబర్
4 గ్రాములు
1 గ్రాములు
చక్కెరలు
0
0
క్యాల్షియం
0
0
ఐరన్
0.36 మిల్లీగ్రాములు
0.36 మిల్లీగ్రాములు
సోడియం
20 మిల్లీ గ్రాములు
0
శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్
0
0
ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాట్
0
0
కొలెస్ట్రాల్
0
0

representational imageబియ్యం ఎన్ని భాగాలు
పైపొట్టు, బ్రాన్, జెర్మ్ గా పేర్కొంటారు. వడ్లను మిల్లింగ్ చేస్తే పై పొట్టు పోయి బియ్యం వేరవుతాయి. అన్ని రకాల బియ్యంలో చేసే ప్రక్రియ ఇదే. పొట్టు కింది భాగంలో ఉండేది జెర్మ్. ఇది పోషకాహార గని. బి విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు ఉంటాయి. బియ్యం పైపొరను బ్రాన్ (తవుడు) అంటారు. ఈ లేయర్ గోధుమ రంగులో ఉంటుంది. ఈ లేయర్ లో కీలకమైన పోషకాలు, బి విటమిన్లు ఉంటాయి. కానీ, పాలిష్డ్ పట్టిన వైట్ రైస్ లో ఇవన్నీ పోతాయి.  

పోషకాల పరంగా ఉండే తేడా
బ్రౌన్ రైస్ అన్నవి బియ్యంపైన ఉండే బ్రౌన్, జెర్మ్ లను తొలగించని రకం. కానీ వైట్ రైస్ లో వీటిని తొలగిస్తారు. అందుకే బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం, ఇతర మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. ఒక కప్పు వైట్ రైస్ లో ఒక గ్రాము ఫైబర్ (పీచు పదార్థం) ఉంటే, బ్రౌన్ రైస్ లో మాత్రం నాలుగు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. పీచు తగినంత తీసుకోవడం వల్ల కార్బొహైడ్రేట్లు (బియ్యంలో ఎక్కువగా ఉంటాయి) రక్తంలో చక్కెరలుగా మారే వేగం తగ్గుతుంది. బ్రౌన్ రైస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. ఒక్క బ్రౌన్ రైసే కాదు... పొడవుగా ఉండే బియ్యం రకాల్లో పొట్టి రకం బియ్యాలతో పోలిస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచివని చెబుతుంటారు. కాకపోతే చిన్నారులు, 60 ఏళ్లు దాటి జీర్ణ పరమైన సమస్యలున్న వారికి లైట్ పాలిష్డ్ బియ్యం వాడుకోవడం మంచిది.

representational imageషార్ట్ గ్రెయిన్: ఇవి చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. ఉడికించినప్పుడు బాగా ఉబ్బి, మెతుకులు అతుక్కుని ఉంటాయి. దీన్నే పెర్ల్ రైస్ లేదా రౌండ్ గ్రెయిన్ రైస్ అని కూడా అంటారు. పార్ బాయిల్డ్ రైస్, అంబేమోహర్, దుబ్రాజ్, గౌరి రకాలు ఈ రకమే. వీటిలో గ్లైసిమిrepresentational imageక్ ఇండెక్స్ అధికం. అలాగే, విటమిన్ బి, పొటాషియం కూడా ఎక్కువే.
మీడియం గ్రెయిన్: ఇవి మధ్యస్థ ఆకారంలో ఉంటాయి. వీటిలో తేమ ఎక్కువగా ఉంటుంది. సోనామసూరి, కామ, పతారా, శ్రావణి రకాలు ఇవే. సాంబమసూరి, బీపీటీ 5204, హెచ్ఎంటీ కూడా మీడియం గ్రెయిన్ రకాలే.
లాంగ్ గ్రెయిన్ రైస్: ఇవి పొడవుగా ఉంటాయి. ఉదాహరణకు బాస్మతి, జాస్మిన్ రకాలు. బాస్మతి కంటే చౌక రకం జాస్మిన్. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ.

6,000 మిగిలాయి....
ఒడిశాకు చెందిన డాక్టర్ దేబ్ లాల్ దేబ్ 700 సంప్రదాయ రైస్ వెరైటీలను సేకరించే పనిలో ఉన్నారు. 1970 వరకు మనదేశంలో 1,10,000 వెరైటీలు ఉండేవని, ఈ వైవిధ్యం దెబ్బతిని, హైబ్రిడ్ రకాల రాకతో నేడు 6,000 వెరైటీలు మాత్రమే సాగవుతున్నాయని ఆయన చెబుతారు.


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
1 year ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
3 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
3 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
3 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
3 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
3 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
3 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
3 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
3 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
3 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
3 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
3 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
3 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
3 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
3 years ago
..more