జస్ట్ రూ.500తో 3D, వర్చువల్ రియాలిటీ (VR) అనుభూతి పొందొచ్చు

01-11-2016 Tue 14:37

మనలో చాలా మంది త్రీడీ సినిమాలు చూసే ఉంటారు. ఏదైనా మన కళ్ల ముందే, మన చుట్టూరా కదులుతున్నట్లుగా, మన ముందే అంతా జరుగుతున్నట్లు అనుభూతి చెందుతాం. త్రీడీలో మరింత అడ్వాన్స్ డ్ టెక్నాలజీయే వర్చువల్ రియాలిటీ. మన ఊహకు అందని ప్రపంచంలో మనం విహరిస్తున్న అద్భుతమైన అనుభూతి మనకు వర్చువల్ రియాలిటీతో సొంతమవుతుంది. త్రీడీలో కళ్లకు గ్లాసులు పెట్టుకుని.. ఏదైనా తెరపై ఫోకస్ చేసిన చిత్రాన్ని చూస్తుంటాం. అది ఒకవైపు మాత్రమే ఉంటుంది. అదే వర్చువల్ రియాలిటీలో అయితే అన్ని కోణాల్లోనూ, కొన్నిసార్లు పూర్తిగా 360 డిగ్రీల కోణంలో సరికొత్త ప్రపంచంలో విహరించవచ్చు. అన్నీ మన కళ్ల ముందే జరుగుతున్నట్లుగా కనిపిస్తుంటాయి. సాధారణ వీడియోలు, సినిమాలను కూడా అచ్చం థియేటర్లో పెద్ద స్క్రీన్ పై చూసిన మాదిరిగా వీక్షించవచ్చు. ఎన్నో రకాల వీడియో గేమ్ లను ఆడుకోవచ్చు. 

వర్చువల్ రియాలిటీ గేమింగ్ మరింత అద్భుతమైనది కూడా. ఈ వర్చువల్ రియాలిటీని అనుభూతి చెందాలనుకుంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రూ.400 నుంచి రూ.3 వేల వరకు ఖర్చుపెడితే.. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ లు, బాక్సులు లభిస్తుంటాయి. వాటిలో మన ఫోన్ ను అమర్చుకుని ఎంజాయ్ చేయడమే.. ఈ వివరాలు తెలుసుకుందామా..

వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్/బాక్స్

అత్యంత తక్కువ ధరలో అత్యంత విభిన్నమైన అనుభూతిని పొందాలంటే వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్/బాక్స్ లను తీసుకోవచ్చు. దీనిద్వారా వర్చువల్ ప్రపంచంలో విహరించవచ్చు. నిజానికి వీఆర్ హెడ్ సెట్ లో ప్రధానంగా ఉండేవి రెండు మ్యాగ్నిఫికేషన్ లెన్సులు మాత్రమే. కానీ లోపల పూర్తి చీకటిగా ఉండి, ఫోన్ తెరను రెండుగా విభజించి.. ఒక్కో కంటితో ఒక్కో భాగాన్ని చూసేలా ఏర్పాటు ఉంటుంది. అదే మనకు వీఆర్ అనుభూతిని ఇస్తుంది. మన కళ్లకు తగినట్లుగా లెన్సుల మధ్య దూరాన్ని పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు... ఫోన్ కు దగ్గరగా, దూరంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు ఉంటాయి.

అతి తక్కువ ధరలో..

వర్చువల్ రియాలిటీకి విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు గూగుల్ సంస్థ అత్యంత చవకగా ‘గూగుల్ కార్డ్ బోర్డ్’ పేరిట వీఆర్ బాక్స్ ల తయారీని అభివృద్ధి చేసింది. కేవలం రెండు మ్యాగ్నిఫికేషన్ అద్దాలు (భూతద్దాలు), కార్డ్ బోర్డ్ సహాయంతో ఈ ‘గూగుల్ కార్డ్ బోర్డ్’లను రూపొందించవచ్చు. ఇదే పేరిట ఎన్నో వర్చువల్ రియాలిటీ వీడియోలను కూడా రూపొందించి, యూట్యూబ్ లో అందుబాటులో ఉంచింది కూడా. ‘గూగుల్ కార్డ్ బోర్డ్’లను కొన్ని సంస్థలు తయారు చేసి, ఆన్ లైన్ లో విక్రయిస్తున్నాయి. వాటిల్లో వాడే లెన్సుల నాణ్యతను బట్టి ఇవి రూ.120 నుంచి రూ.1,500 వరకు దొరుకుతాయి.

వీఆర్ బాక్సులు

‘గూగుల్ కార్డ్ బోర్డ్’ను ప్రేరణగా తీసుకుని ప్లాస్టిక్, ఫైబర్, ముఖానికి, ముక్కుకు మంచి కుషన్ అందించే ఏర్పాట్లతో వీఆర్ బాక్స్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో వెర్షన్ 1, వెర్షన్ 2 అని కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్ బిల్ట్ గా ఎటువంటి సెన్సర్లు, స్పీకర్లు ఉండవు. ఫోన్ లోని సెన్సర్లను వినియోగించుకుని ఈ వీఆర్ బాక్స్ లు పనిచేస్తాయి. గూగుల్ కార్డ్ బోర్డ్ కంటే కొంత మెరుగైన వీఆర్ బాక్స్ లు రూ.350 నుంచి రూ.2,000 వరకు లభిస్తున్నాయి. ఫోన్ ను వీఆర్ బాక్స్ లో పెట్టాక ఆపరేట్ చేసేందుకు వీలుగా బ్లూటూత్ రిమోట్ లు కూడా లభ్యమవుతున్నాయి. వీటిని అదనంగా గానీ, వీఆర్ బాక్స్ తో కలిపిగానీ కొనుగోలు చేయవచ్చు. 

వీఆర్ హెడ్ సెట్ లు

పూర్తి స్థాయిలో వర్చువల్ రియాలిటీ, త్రీడీ అనుభూతిని పొందేందుకు వీఆర్ హెడ్ సెట్ లు లభిస్తాయి. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. సామ్సంగ్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ వీఆర్ హెడ్ సెట్లను తయారుచేస్తాయి. వీటిల్లో అత్యంత నాణ్యమైన లెన్సులను వాడుతారు. వీటిలో మోషన్ సెన్సర్, మ్యాగ్నటిక్ సెన్సర్, గైరోస్కోప్ వంటి సెన్సర్లు కూడా ఉంటాయి. కొన్నింటిలో ఇన్ బిల్ట్ గా స్పీకర్లు, మైక్రోఫోన్లు కూడా ఉంటాయి. సాధారణ వీఆర్ బాక్స్ లలో హెడ్ ఫోన్లు లేకపోవడంతో పూర్తిగా వీఆర్ అనుభూతి దక్కదు. అదే వీఆర్ హెడ్ సెట్లలో ఉండే స్పీకర్లతో త్రీడీ వీడియోలు, గేమ్ లను ఆడితే అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది.

హైఎండ్ వాటిల్లో ఇన్ బిల్ట్ స్క్రీన్ కూడా..

ఇక హైఎండ్ వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్లలో వాటిల్లోనే ఇన్ బిల్ట్ గా స్క్రీన్ కూడా ఉంటుంది. మన మొబైల్ కు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకుని వాటిని వినియోగించుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో అన్ని రకాల సెన్సర్లతో పాటు గేమ్ కంట్రోలర్లు, రిమోట్లు వంటివి కూడా ఉంటాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్తి స్థాయిలో అత్యుత్తమ వర్చువల్ రియాలిటీ అనుభూతిని పొందడానికి, వర్చువల్ రియాలిటీ గేమ్ లు ఆడడానికి ఈ హెడ్ సెట్ లు అత్యుత్తమంగా ఉంటాయి. అయితే ఈ వీఆర్ హెడ్ సెట్ల ధరలు చాలా ఎక్కువగా.. అంటే వేల రూపాయల్లో ఉంటాయి.

ప్రత్యేకంగా వీఆర్ వీడియోలూ ఉంటాయి..

హాలీవుడ్ సినిమాలను వర్చువల్ రియాలిటీ ఫార్మాట్ లో కూడా విడుదల చేస్తుంటారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల ట్రైలర్లను వర్చువల్ రియాలిటీలో విడుదల చేస్తున్నారు కూడా. ఇక కొన్ని సంస్థలు ప్రత్యేకంగా వీఆర్ వీడియోలను రూపొందించి విడుదల చేస్తున్నాయి. వాటితో అయితే పూర్తి స్థాయిలో 3డీ, వర్చువల్ రియాలిటీ అనుభూతిని పొందవచ్చు. వీటిలో కొన్ని 360 డిగ్రీల (మనం ఎటువైపు తిరిగితే అటువైపు దృశ్యం కనిపించేలా) వీడియోలూ అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ నుంచి, కొన్ని సైట్ల నుంచి ఆ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీఆర్ వీడియోస్, కార్డ్ బోర్డ్ వీడియోస్ పేరిట సెర్చ్ చేసి ఈ వీడియోలను పొందవచ్చు. వీటిని డౌన్ లోడ్ చేసుకుని నేరుగా ఫోన్ లోని సాధారణ ప్లేయర్ తోనే ప్లే చేసి చూడొచ్చు. 

సాధారణ వీడియోలూ వీఆర్ వీడియోలుగా..

ఇక సాధారణ వీడియోలు, సినిమాలను కూడా వీఆర్ కు అనుకూలంగా మార్చి అందించే ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్ లో వీఆర్ యాప్స్ ను సెర్చ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ మన ఫోన్, మెమరీ కార్డ్ లోని వీడియోలను వీఆర్ టెక్నాలజీకి అనుగుణంగా మార్చి ప్లే చేస్తాయి. అందువల్ల ఆ వీడియోలను థియేటర్ లో పెద్ద తెరపై చూసిన అనుభూతి సొంతమవుతుంది. ఇలాంటి యాప్ లలో ‘ఏఏఏ వీఆర్ ప్లేయర్’ అద్భుతంగా పనిచేస్తుంది.

వీఆర్ గేమ్స్ తో మరింత మజా

సాధారణంగా ఫోన్ లో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతూ ఉంటాం. చిన్న స్క్రీన్ పైనే ఆ గేమ్స్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయి. మరి అదే గేమ్స్ ను పెద్ద తెరపై, త్రీడీ రూపంలో ఆడగలిగితే ఇంకా బాగుంటుంది కదా. వీఆర్ హెడ్ సెట్/బాక్స్ ల ద్వారా ఆడగలిగే ఎన్నో ప్రత్యేకమైన గేమ్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని.. గేమింగ్ మజాను అనుభూతి చెందవచ్చు.

ప్రత్యేకమైన వీఆర్ యాప్స్

వర్చువల్ రియాలిటీ అనుభూతిని పొందేందుకు కొన్ని ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు రోలర్ కోస్టర్ వీఆర్ యాప్.. దీని ద్వారా రోలర్ కోస్టర్లో నిజంగానే ప్రయాణించిన అనుభూతిని పొందవచ్చు. బెంజ్ కారులో విహరిస్తున్న అనుభూతి కావాలంటే మెర్సిడెస్ వీఆర్ ఫర్ కార్డ్ బోర్డ్ యాప్ ను, బొమ్మల గ్యాలరీని 3డీలో చూసేందుకు టిల్ట్ బ్రష్ గ్యాలరీ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఇంకెన్నో అద్భుతమైన యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏ ఫోన్లలో వాడుకోవచ్చు..

మూడున్నర అంగుళాల ఫోన్ల నుంచి 6 అంగుళాల డిస్ప్లే ఉన్న ఫోన్లు, ట్యాబ్లెట్ల వరకు వీఆర్ హెడ్ సెట్/బాక్స్ లలో వినియోగించుకోవచ్చు. అయితే కొన్ని రకాల వీఆర్ హెడ్ సెట్/బాక్స్ లలో కొన్ని పరిమాణాలున్న ఫోన్లను పెట్టుకోవడానికి మాత్రమే అవకాశముంటుంది. అందువల్ల మన వద్ద ఉన్న ఫోన్ కు తగిన వీఆర్ హెడ్ సెట్/బాక్స్ ను కొనుగోలు చేయడం మంచిది. సాధారణంగా కొత్తగా వర్చువల్ రియాలిటీ అనుభూతిని సొంతం చేసుకోవాలంటే తక్కువ ధరకు లభించే వీఆర్ బాక్స్ లేదా గూగుల్ కార్డ్ బోర్డ్ లను కొనుగోలు చేయడం బెటర్. ఇటీవల పలు కంపెనీలు తమ ఫోన్లతో వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ లను కూడా అందిస్తున్నాయి. కొత్తగా ఫోన్ కొనదల్చుకుంటే.. ఆ ఫోన్లు తీసుకోవచ్చు.

కొన్ని బెస్ట్ వీఆర్ హెడ్ సెట్ లు..


More Telugu Articles
లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
1 year ago
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. అంగ్ కోర్ వాట్. ఎక్కడుందో, ప్రత్యేకతలేమిటో తెలుసా?
3 years ago
చర్మంపై మచ్చలా.. జాగ్రత్త! తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎన్నో సమస్యలు, కేన్సర్ కూ కారణమవొచ్చు
3 years ago
మన శరీరంలో మనకు తెలియని కొత్త అవయవాలు.. ఇంటర్ స్టిటియమ్, మిసెంటరీ
3 years ago
నిద్ర పట్టడం లేదా, నీరసంగా ఉంటోందా.. కిడ్నీ సమస్యలు కావొచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
3 years ago
ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!
3 years ago
ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లపై ఈ నంబర్లేమిటి.. ఏ ప్లాస్టిక్ డేంజర్.. ఏది సేఫ్..? తెలుసుకోండిలా..
3 years ago
టైప్-1, టైప్-2 డయాబెటిస్ కాదు.. మధుమేహం ఐదు రకాలు, వాటికి కారణాలివీ..
3 years ago
మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ ‘పదీ’ పాటిస్తే చాలు..
3 years ago
ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి
3 years ago
స్వేచ్ఛగా ‘ఊపిరి’ తీసుకోండి.. ఊపిరితిత్తుల వ్యాధులకు, కేన్సర్ కు దూరంగా ఉండండి
3 years ago
వ్యాలెట్లకు ఫుల్ కేవైసీ పూర్తి చేశారా... లేదంటే కొన్ని ప్రయోజనాలు ఉండవు...?
3 years ago
జస్ట్ మాట్లాడుతూనే కంప్యూటర్ లో తెలుగు టైపింగ్.. మీ స్మార్ట్ ఫోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్..!
3 years ago
ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో
3 years ago
ఎండలు పెరిగిపోతున్నాయ్.. ఏసీ లేకున్నా ఇంటిని చల్లగా ఉంచుకోండిలా..!
3 years ago
..more