జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
Advertisement
జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. గురువారంనాడు మీడియా అకాడమీ కార్యాలయంలో ఇటీవల మరణించిన టీవి-5 కుత్బుల్లాపూర్ జర్నలిస్టు శిరీష్ కుమార్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 259 కుటుంబాలకు లక్ష రూపాయల వంతున 2 కోట్ల 59 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశామన్నారు. మరణించిన ఆయా జర్నలిస్టు కుటుంబాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ను అయిదేళ్లపాటు అందిస్తున్నామని అన్నారు. అట్లాగే ఆయా కుటుంబాలలోని ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివే 144 మంది విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును చెల్లిస్తున్నామన్నారు. తీవ్ర అనారోగ్య కారణాల వల్ల పని చేయలేని స్థితిలో ఉన్న 93 మంది జర్నలిస్టులకు యాభై వేల రూపాయలను వర్కింగ్ జర్నలిస్టులకు అందజేశామన్నారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్యూజే కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, టీయూడబ్యూజే నాయకులు పి. శివాజి, కుత్బుల్లాపూర్ అధ్యక్షులు కె. వెంకట్, యూ. వెంకటేశ్ గౌడ్, సంతోష్, మాధవరెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Thu, Jan 23, 2020, 08:41 PM
Advertisement
2020-02-28T20:00:02+05:30
2020-02-25T16:05:34+05:30
2020-02-25T15:43:40+05:30
2020-02-25T11:16:35+05:30
2020-02-25T09:16:51+05:30
2020-02-24T18:36:33+05:30
2020-02-24T18:33:20+05:30
2020-02-24T18:31:44+05:30
2020-02-24T17:03:44+05:30
2020-02-24T16:52:58+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View