స‌మష్టికృషితో విత్త‌న‌స‌ద‌స్సు విజ‌య‌వంతం: మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి
Advertisement
- ఇస్టా స‌ద‌స్సుతో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాం
- ఉపాద్య‌క్షుడిగా ఎన్నిక‌యిన తెలంగాణ‌ సీడ్స్ డైరెక్ట‌ర్ కేశ‌వులుకు స‌న్మానం
- స‌ద‌స్సు విజ‌య‌వంతానికి కృషి చేసిన వ్య‌వ‌సాయ శాఖ‌ ముఖ్య కార్య‌ద‌ర్శి పార్ధ‌సార‌ధికి అభినంద‌న‌లు
- తెలంగాణ నుండి ఇస్టాలో చోటు ద‌క్కించుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణం
- రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి

ఆసియాలో దేశాల‌లో తొలిసారి భార‌త‌దేశంలో అందునా తెలంగాణ‌లో నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ విత్త‌న స‌ద‌స్సు (ఇస్టా) విజ‌య‌వంతం కావ‌డానికి అంద‌రి కృషి ఉంద‌ని, ఇస్టా స‌ద‌స్సుతో ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించగ‌లిగామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. మంత్రి ఛాంబ‌ర్ లో బుధ‌వారం వ్య‌వ‌సాయ శాఖ‌ ముఖ్య కార్య‌ద‌ర్శి పార్ధ‌సార‌ధి, తెలంగాణ‌ సీడ్స్ డైరెక్ట‌ర్ కేశ‌వులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భార‌త్ నుండి తొలిసారి తెలంగాణ వ్య‌క్తి ఇస్టా స్టాండింగ్ క‌మిటీలో ఉపాధ్య‌క్షులుగా తెలంగాణ‌ సీడ్స్ డైరెక్ట‌ర్ కేశ‌వులు చోటు ద‌క్కించుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణమ‌ని స‌న్మానం చేసి అభినందించారు. స‌ద‌స్సు విజ‌య‌వంతానికి కృషి చేసిన వ్య‌వ‌సాయ శాఖ‌ ముఖ్య కార్య‌ద‌ర్శి పార్ధ‌సార‌ధికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఉపాధ్య‌క్షులుగా ఎన్నిక‌యిన కేశ‌వులు 2022 జూన్ వ‌ర‌కు ఇస్టా ఉపాధ్య‌క్షులుగా కొన‌సాగుతారు. ఆ త‌రువాత 33వ ఇస్టా కాంగ్రెస్ గ‌వ‌ర్నింగ్ బాడీకి అధ్య‌క్షులుగా 2022 నుండి 2025 వ‌ర‌కు కొన‌సాగుతారు.
Thu, Jul 04, 2019, 09:52 AM
Advertisement
2019-11-19T14:23:28+05:30
2019-11-19T09:22:54+05:30
2019-11-18T17:03:54+05:30
2019-11-18T16:20:44+05:30
2019-11-18T15:30:55+05:30
2019-11-18T10:20:24+05:30
2019-11-18T09:37:54+05:30
2019-11-16T14:30:53+05:30
2019-11-16T14:07:18+05:30
2019-11-15T16:20:10+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View