/

హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా జరుగనున్న పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేదపై అంతర్జాతీయ సదస్సు

24-11-2022 Thu 16:52

·       భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సదస్సు నిర్వహించనున్న ఎస్‌జీపీ

·       ఆయుర్వేద మరియు ఆధునిక మెడిసన్‌ను ఏకీకృతం చేసే శాస్త్రీయ ఆధారిత  ఇంటిగ్రేటివ్‌ ప్లాట్‌ఫామ్‌ పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేద

హైదరాబాద్‌ , 24 నవంబర్‌ 2022 : పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేద– ఫ్రీ ఇన్నోవేషన్‌ టు ఇంపాక్ట్‌ శీర్షికన  మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును ఎస్‌జీపీ నిర్వహించబోతుంది.  హైదరాబాద్‌లోని  ఐఐటీ క్యాంపస్‌లో  జనవరి 21–22, 2023లో మొట్టమొదటిసారిగా ఈ అంతర్జాతీయ సదస్సు జరుగనుంది.  దాదాపు 400 మంది  పరిశోధకులు, మెడికల్‌ డాక్టర్లు, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు, ప్రభుత్వ అధికారులు, కార్పోరేట్‌ ప్రతినిధులతో కూడిన డెలిగేట్లు యుఎస్‌ఏ, రష్యా, యుకె, కెనడా, ఇండియా మరియు 8 దేశాల నుంచి రెండు రోజుల సదస్సులో పాల్గొననున్నారు.

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో  చికిత్సకు మద్దతునందించే విస్తృత స్ధాయి శాస్త్రీయ పరిశోధనలు, స్టాటిస్టికల్‌ డాటా పాయింట్లు, పరిశోధనా నివేదికలు, ఆయుర్వేద మౌలిక సూత్రాలు వంటివి చర్చించనున్నారు.

ఆరోగ్యపరంగా అసమానతలు తొలగించడానికి  దేశం లక్ష్యంగా చేసుకున్న వేళ  భారీ వైద్య మౌలిక సదుపాయాలతో  హైదరాబాద్‌ వినూత్న స్ధానంలో ఉంది. ఈ సదస్సుతో  ఇప్పుడు హైదరాబాద్‌ దేశపు ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా నిలువనుంది. వైద్య పర్యాటకానికి ప్రత్యామ్నాయ కేంద్రంగా నిలవడంతో పాటుగా ఈ వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ  సేవలను అనుభవించాలనుకునే వారికి ప్రయోజనం కలిగిస్తుంది.

ఈ సదస్సుకు భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖ; యుకె ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ ఆన్‌ ఇండియన్‌ సైన్సెస్‌, రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ నేచురల్‌ సైన్సెస్‌ వంటివి మద్దతు అందిస్తున్నాయి.  తెలంగాణా వైద్యశాఖామాత్యులు శ్రీ  హరీష్‌ రావు టీ ఈ సదస్సు ప్రారంభించనున్నారు. సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్‌ దేవి శెట్టి ; డాక్టర్‌ నరేష్‌ ట్రెహాన్‌ ; డాక్టర్‌ బీఎం హెగ్డే, డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే వంటి వారు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.  ఈ సదస్సులో  యుకె పార్లమెంట్‌ సభ్యులు బాబ్‌ బ్లాక్‌మాన్‌, రష్యా పార్లమెంట్‌ సభ్యురాలు లుబాయ్‌ దుఖ్నానినా హాజరుకానున్నారు.

ఎస్‌జీపీ వ్యవస్ధాపకులు, పాలీ సైంటిఫిక్‌ ఆయుర్వేద (పీఎస్‌ఏ) ఆవిష్కర్త డాక్టర్‌ రవిశంకర్‌ పోలిశెట్టి   మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య రాజధానిగా మలిచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పురాతన పరిజ్ఞానం, ఆధునిక శాస్త్రం మిళితం చేసి మెరుగైన ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
 


More Press Releases
..more