భవిష్యత్ తెలంగాణ ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
Advertisement

•పట్టణాభివృద్ది సంస్ధల సమీక్షా సమావేశంలో మంత్రి

•రానున్న సంవత్సరాల్లో మేజార్జీ జనాబా పట్టణాల్లోనే

•భవిష్యత్తు అవసరాల మేరకు మాస్టర్ ప్లానింగ్ పట్టణాభివృద్ది సంస్ధల ప్రాథమిక భాద్యత

•ఆ దిశగా పట్టణాభివృద్ది సంస్ధలు కార్యచరణ ప్రారంభించాలి

•పట్టణాభివృద్ది సంస్ధలు స్వయం సమృద్దిగా మారేందుకు కార్యక్రమాలు చేపట్టాలి

•పట్టణాభివృద్ది సంస్ధల తమ ల్యాండ్ బ్యాంకు వివరాలను సిద్దం చేసుకోవాలి

•రాష్ట్రంలోని హెచ్ యండిఏ వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోతుంది

•హెచ్ యండిఏ పనితీరుని పరిశీలించాలని పట్టణాభివృద్ది సంస్ధలకు సూచన

పట్టాణాభివృద్ది సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని, పట్టణాల భవిష్యత్తు కోసం పట్టణాభివృద్ది సంస్ధలు పనిచేయాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూమారు 43శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతాన్ని దాటుతుందని, ఈనేపథ్యంలో పెరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా అవసరాల కోసం  పట్టణాభివృద్ది సంస్ధలు ప్రణాళిక బద్ద ప్రగతి పట్టణాభివృద్ది సంస్ధలతోనే సాద్యమన్నారు. రాష్ర్టంలోని పట్టణాభివృద్ది సంస్ధల చైర్మన్లు ఇందుకోసం పనిచేయాలన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయడం పట్టణాభివృద్ది సంస్ధల ప్రాథమిక విధి అని, ఈ దిశగా అన్ని పట్టణాభివృద్ది సంస్ధలు కార్యచరణ ప్రారంభించాలని కోరారు. పట్టణ అవసరాలకు అవసరం అయిన గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్ లాంటి జోనింగ్ ల ఏర్పాటు అయా పట్టణాల్లోని చెరువులు, సరస్సుల వంటి నీటి వనరుల రక్షణ, సబర్బన్ ప్రాంతాల అభివృద్ది లాంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకోవాలన్నారు. వరంగల్ పట్టణాభివృద్ది సంస్ధ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రచురణకు సిద్దంగా ఉన్నదని మంత్రి తెలిపారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ అవలంబించిన ప్రక్రియను అవగాహన చేసేకునేందుకు, పట్టణాభివృద్ది సంస్ధల అధికారాలు, రాబడి వనరులు మొదలైన విషయాలపైన రేపు డిటిసిపి, మున్సిపల్ శాఖాధికారులతో సమావేశం కావాలని చైర్మన్లు, అధికారులను కోరారు.

 

పట్టణాభివృద్ది సంస్ధల అంతిమంగా స్వయం సమృద్ది సాధించే దిశగా పనిచేయాలని, ఇందుకోసం ల్యాండ్ పూలింగ్- అభివృద్ది విధానంలాంటి మార్గాలను అనుసరించాలని మంత్రి అన్నారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు ఎల్అర్ యస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్రమ లేఅవుట్లు లేకుండా చూస్కోవాలన్నారు. పట్టణాభివృద్ది సంస్ధలు తమ సొంత రెవెన్యూలను పెంచుకునేలా కార్యక్రమాలు చేపట్టడంపైన దృష్టి సారించాలన్నారు. ప్రతి పట్టణాభివృద్ది సంస్ధ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రయివేటు భూములు, అటవీ భూములతో కూడిన ల్యాండ్ బ్యాంకు సమగ్ర వివరాలు సిద్దంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో హెచ్ యండిఏ 7600 చదరపు కీలోమీటర్ల పరిధిలో వినూత్నమైన విధానాలు, కార్యక్రమాలతో పనిచేస్తున్నదని, సంస్ధ అనుభవాలతో రాష్ట్రంలోని మిగిలిన పట్టణాభివృద్ది సంస్ధలు నేర్చుకోవాలన్నారు. దీంతోపాటు మరింత అవగాహన కోసం అవసరం అయితే దేశంలో మంచి ప్రగతి సాధిస్తున్న పట్టణాభివృద్ది సంస్ధలను అధ్యయనం చేసేందుకు వెళ్ళిరావాలని చైర్మన్లు, అధికారులకు మంత్రి సూచించారు. నూతన మున్సిపాలిటి చట్ట నేపథ్యంలో పట్టణాభివృద్ది సంస్ధలు, హెచ్ యండిఏ చట్టాల్లోనూ తీసుకురావాల్సిన మార్పులపైన ఒక నివేదికను తయారు చేయాలని పురపాలక శాఖాధికారులను అదేశించారు.

ఈ సమావేశంలో పట్టణాభివృద్ది సంస్ధల చైర్మన్లు మర్రి యాదవ రెడ్డి-వరంగల్, జివి రామాకృష్టరావు-కరీంనగర్, రవీందర్ రెడ్డి-సిద్దిపేట, ప్రభాకర్ రెడ్డి-నిజామాబాద్, మరియు ఇతర పట్టణాభివృద్ది సంస్ధల అధికారులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Fri, Nov 08, 2019, 09:24 AM
Advertisement
2020-02-20T14:58:09+05:30
2020-02-19T16:52:45+05:30
2020-02-19T16:46:51+05:30
2020-02-19T15:00:57+05:30
2020-02-19T14:51:16+05:30
2020-02-19T10:22:49+05:30
2020-02-19T09:58:57+05:30
2020-02-19T09:24:11+05:30
2020-02-17T18:51:58+05:30
2020-02-17T18:31:20+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View