కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్!
Advertisement

మృతిచెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో బీమా చెక్కులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 31కోట్ల 62 లక్షలు చెల్లించామన్నారు. అదే క్రమంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిమ్ములను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా, పార్టీ తరపున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, టీఆర్‌ఎస్‌ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణం అని అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదని, 60 లక్షల మంది కార్యకర్తలను సీఎం కేసీఆర్‌ గారు కడుపులో పెట్టి చూసుకుంటారన్నారు.

భారతదేశంలో ఒకటి రెండు పార్టీలు మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తున్నాయని, ఈసారి కార్యకర్తలకు బీమా కోసం ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.11.50 కోట్లు కట్టినామని తెలిపారు. అంతేకాదు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందంటే లక్షలాది మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కృషి ఉందన్నారు. త్వరలోనే మిగతా వారికి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. 
Wed, Nov 06, 2019, 04:49 PM
Advertisement
2019-11-16T14:30:53+05:30
2019-11-16T14:07:18+05:30
2019-11-15T16:20:10+05:30
2019-11-15T14:55:02+05:30
2019-11-15T10:23:46+05:30
2019-11-15T09:11:13+05:30
2019-11-14T16:17:37+05:30
2019-11-14T14:53:40+05:30
2019-11-14T14:12:19+05:30
2019-11-14T09:49:31+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View