ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి!
Advertisement

మాట ఇచ్చిన .. నీళ్లు తెచ్చిన : మంత్రి సింగిరెడ్డి

- వనపర్తి  పట్టణానికి, సంస్థానకేంద్రానికి సాగునీటి కోసం ఆనాటి సంస్థానాధీషులు కట్టించిన చెరువు

- సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురై అన్యాక్రాంతమయింది

- 160 ఎకరాల చెరువు శిఖంలో దాదాపు 60 ఎకరాలలో అక్రమకట్టడాలు వెలిశాయి

- ఈ చెరువులో ప్రజలు నీళ్లు చూడక దశాబ్దాలు అయిపోయింది

- ఇక ఈ చెరువుకు కృష్ణా నీళ్లు చూస్తమా అన్న అపనమ్మకం ప్రజలకు ఉండేది

- కృష్ణా నీళ్లు తెస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుని నల్లచెరువును అలుగుపారించినం

- వనపర్తి  ప్రజల ఆకాంక్షను నెరవేేర్చడం జరిగింది

- నల్లచెరువు నిండడంతో దీని కింద ఆయకట్టు భూములు సాగులోకి రావడమే కాకుండా వనపర్తి చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో బోర్లు రీఛార్జ్ అయ్యాయి

- పట్టణంలో మత్స్యకార కుటుంబాలు అధికంగా ఉన్నాయి .. వారికి జీవనోపాధి కరువయింది

- నల్లచెరువు అలుగు పారుతుంది .. పట్టణం పరిధిలో ఉన్న తాళ్లచెరువు, ఈదుల చెరువుల పునరుద్దరణ కార్యక్రమం సాగుతుంది

- వచ్చే వానకాలానికి ఆ రెండు చెరువులు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించుకోవడం జరిగింది

- ఈ మూడు చెరువులు నిండితే వీటిలోని మత్స్యసంపదతో మత్స్యకార కుటుంబాలకు సరిపడా ఉపాధి లభిస్తుంది

- పర్యాటకపరంగా, అహ్లాదకరంగానే కాకుండా మత్స్యకారులకు ఆర్థిక స్వావలంబన కలుగుతుంది

- పట్టణానికి ఈశాన్యంలో ఉన్న చెరువు గతంలో  కుళ్లిన కళేబరాలు, మురికితుమ్మ చెట్లు, మురుగునీళ్లతో  అత్యంత దారుణంగా ఉండేది

- ఈ పరిసరాల వైపు ప్రజలు సంతరించడానికే ఇష్టపడేది కాదు

- ఈ రోజు రోజుకు వెయ్యిమంది చెరువు కట్టను చూసి వెళ్లి అహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు

- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో వందలాది చెరువులను పునరుద్దరిస్తూ, నీటితో నింపుతూ పోతున్నాం

- ఒక్కొక్క చెరువును నింపడాన్ని ఒక తపస్సులా భావిస్తూ పనిచేస్తున్నాం

- ఈ రోజు పట్టణ ప్రజలతో కలిసి నల్లచెరువు అలుగుకు పూజలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను

- నల్లచెరువు అలుగెల్లిన సంధర్భంగా పూజలు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 

Fri, Oct 25, 2019, 04:12 PM
Advertisement
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
2019-11-29T11:14:10+05:30
2019-11-29T09:00:42+05:30
2019-11-27T16:05:56+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View