బుద్ధవనం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష!
Advertisement

బుద్ధవనం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బుద్ధవనం ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. బౌద్ద వనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో తెలంగాణ బౌద్ద సంగీతి ని నిర్వహించాలని మంత్రి ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

నాగార్జున సాగర్ లో బౌద్ద వారసత్వానికి ప్రతీకగా నిర్మిస్తున్న బౌద్ద వనం ప్రాజెక్టును వచ్చే ఫిబ్రవరి 9న - 2020 లో ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ పర్యటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, కె. సుధాన్ రెడ్డి, క్రాంతి బాబు, శ్రీనివాసన్ కన్సల్టెంట్ లు పాల్గొన్నారు.

Thu, Oct 24, 2019, 04:56 PM
Advertisement
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
2019-11-29T11:14:10+05:30
2019-11-29T09:00:42+05:30
2019-11-27T16:05:56+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View