బాలల హక్కులను పరి రక్షించాలి.. బాలలకు బంగారు బాట వేయాలి: వినోద్ కుమార్
Advertisement
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్  బాలల హక్కుల పరి రక్షణ కమిషన్ ఛైర్మన్, సభ్యుల భేటీ

రాష్ట్రంలో బాలల హక్కులను పరి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

గురువారం తన నివాసంలో కలిసిన బాలల హక్కుల పరి రక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాసరావు, సభ్యులతో వినోద్ కుమార్ పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో బాలల హక్కుల పరి రక్షణ కోసం గట్టి చర్యలు చేపట్టాలని కమిషన్ బృందానికి వినోద్ కుమార్ సూచించారు. బాలలను సమాజంలో ఉత్తములుగా తీర్చి దిద్దాలని, అందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలని ఆయన అన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయాన్ని మరువ వద్దని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వినోద్ కుమార్ సూచించారు. భవిష్యత్తు బాలలదేనని, వారి అభ్యున్నతికి కృషి చేస్తేనే నవ సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బాల కార్మికులు లేకుండా చూడాలని, బాలలందరూ చదువు కునేలా చూడాలని ఆయన అన్నారు. ఈ బృందంలో రాష్ట్ర బాలల హక్కుల పరి రక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాసరావు, సభ్యులు బృందాధర్ రావు, అంజన్ రావు, దేవయ్య,  అపర్ణ, శోభారాణి, రాగ జ్యోతి, తదితరులు ఉన్నారు.

Thu, Oct 24, 2019, 04:48 PM
Advertisement
2019-11-30T10:11:57+05:30
2019-11-30T09:18:14+05:30
2019-11-29T16:53:23+05:30
2019-11-29T16:33:54+05:30
2019-11-29T16:16:19+05:30
2019-11-29T14:30:10+05:30
2019-11-29T13:10:38+05:30
2019-11-29T11:14:10+05:30
2019-11-29T09:00:42+05:30
2019-11-27T16:05:56+05:30
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View