యార్లగడ్డకు డల్లాస్ శ్రీనివాస కళ్యాణ ఆహ్వానం

23-06-2022 Thu 16:22

డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి ఆధ్యర్యంలో శనివారం నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణం వేడుకకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పద్మభూషణ్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను ఆహ్వానించారు. టెక్సాస్ లోని అలెన్ ఈవెంట్ సెంటర్ లో జరిగే స్వామి వారి కళ్యాణ వేడుకకు దాదాపు 7,500 మంది భక్తులు హాజరు కానున్నారని సమితి ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఇంద్రాణి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ, భవిష్యత్తు తరాలకు తెలుగు భాషను, కుటుంబ విలువలను అందించటం ధ్యేయంగా తమ సమితి పనిచేస్తుందన్నారు. ఉన్నతమైన ధ్యేయంతో సమాజం పట్ల ప్రేమతో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి సేవలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డ పేర్కొన్నారు.


More Press Releases
..more