Advertisement
స్వయంగా మంత్రి రైతు కావడం ఆనందంగా ఉంది: తెలంగాణ గవర్నర్ తమిళిసై
Advertisement

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండురోజుల వర్క్ షాప్ ప్రారంభం సంధర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి:

- తన వ్యవసాయక్షేత్రాన్ని, జోగుళాంబ ఆలయాన్ని త్వరలోనే సందర్శిస్తాను

- సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ మంత్రి మామిడి పండ్లను యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం రైతులకు స్ఫూర్థి దాయకం

- పాలమూరు జిల్లాలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు మంత్రి నిరంజన్ రెడ్డి కృషిని అభినందిస్తున్నాను

- యువత వ్యవసాయ రంగం వైపు చూపు మరల్చేలా ప్రోత్సహించాలి

- వ్యవసాయం లాభదాయకం అయితేనే వారు ఇటువైపు అడుగులు వేస్తారు

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాయి

- రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద గవర్నర్ ప్రశంసలు 

-  ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండురోజుల వర్క్ షాప్ ప్రారంభం సంధర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్


దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిది కీలకపాత్ర:

-  ఇక్కడి జనాభాలో 54.6% మంది వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు 

-  తెలంగాణ రాష్ట్ర జనాభాలో 60% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు 

- వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం  వ్యవసాయ రుణ మాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీ విత్తనాలు, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ ప్రయోజనాల కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. రైతుబంధు, రైతుభీమా వంటి అనేక సహాయ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది

- మిషన్ కాకతీయతో చెరువులను పునర్నిర్మించి చిన్ననీటి పారుదల వ్యవస్థను క్రమబద్దీకరించడం జరిగింది

- ప్రతి మండలానికి  ఒక వ్యవసాయ అధికారిని, ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు సేవలను అందుబాటులో ఉంచడం జరిగింది

-  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వ్యవసాయం, అనుబంధ రంగాలకు శిక్షణ పొందిన మానవ వనరుల కోసం కొత్త వ్యవసాయ, ఆహార శాస్త్ర మరియు సాంకేతిక మరియు పాలిటెక్నిక్‌ కళాశాలలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

- ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చేయూతనిచ్చేందుకు పంటకాలనీలను ప్రోత్సహిస్తున్నారు 

- దేశ జనాభాలో 41 శాతం యువత ఉన్నారు. మనది యువదేశం

-  వ్యవసాయం వైపు యువత ఆసక్తి క్షీణిస్తుంది. వ్యవసాయ రంగ శ్రేయస్సు కోసం యువత సహకారం తప్పనిసరి

- ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే లాభం తగ్గడంవల్ల వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం తగ్గుతుంది

-  వ్యవసాయరంగం వైపు యువతను ఆకర్షించడం ఇప్పుడు ప్రధానమయిన అంశం

-  గ్రామీణ కుటుంబాలకు చెందిన 20% యువత మాత్రమే వ్యవసాయంలో ప్రత్యక్షంగా ఉపాధి కొరకు నిమగ్నమైందని తెలుస్తుంది

-  పంటల పెంపకంతో పాటు పాడి వ్యవసాయం, తేనెటీగ-సంస్కృతి, పుట్టగొడుగుల సాగు, సెరికల్చర్, చేపల పెంపకం వంటి వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా యువతను ఈ రంగం వైపు ఆకర్షించగలుగుతాం

-  గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉత్పాదక యూనిట్లను, వనరుల లభ్యతను తెలుసుకునేందుకు పంచాయతీ స్థాయిలో శిక్షణ ఇవ్వాలి. సంబంధిత బ్యాంకులు, ఇతర సంస్థల నుండి తక్కువ వడ్డీ రేటుకు ఆర్థికసాయం చేయడంతో పాటు రైతులు పండించిన ఉత్పత్తులకు గరిష్టమయిన గిట్టుబాటు ధర పొందేలా గ్రామీణ ప్రాంతాలలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది

- వ్యవసాయం లాభసాటి అని భావిస్తే గ్రామీణ యువత దీనిని  వృత్తిగా స్వీకరించే అవకాశం ఉంటుంది

-  వివిధ విజయవంతమయిన వ్యవసాయ సంబంధిత క్షేత్రాలను యువతకు పరిచయం చేయడం, వర్క్ షాపులు నిర్వహించడం ద్వారా యువతను వ్యవసాయం వైపు ప్రేరేపించాలి 

-  ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘లాభదాయక వ్యవసాయం - యువత పాత్ర‘ అనే అంశంపై రెండురోజుల వర్క్ షాప్ ప్రారంభం సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Mon, Oct 21, 2019, 02:27 PM
Advertisement
2020-06-03T21:03:22+05:30
2020-06-03T18:33:00+05:30
2020-06-03T18:26:30+05:30
2020-06-03T17:08:37+05:30
2020-06-03T16:53:49+05:30
2020-06-03T15:56:01+05:30
2020-06-03T15:02:13+05:30
2020-06-03T14:57:25+05:30
2020-06-02T21:58:52+05:30
2020-06-02T21:06:01+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View