పారిశుధ్య నిర్వహణ విధానాన్ని పరిశీలించిన వీఎంసీ కమిషనర్

28-01-2022 Fri 14:50

విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా శుక్రవారం క్షేత్ర స్థాయిలో 4వ శానిటరీ డివిజన్ నందలి పలు వీధులలో పారిశుధ్య నిర్వహణ విధానంను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొన్నారు. డివిజన్ నందు ఇంటింటి చెత్త సేకరణ విషయమై శానిటరీ కార్మికురాలిని నివాసాల వారు నేరుగా చెత్తను విభజించి అందిస్తున్నది లేనిది అడిగితెలుసుకొనిన సందర్భంలో సెగ్రిగేషన్ విధానము అమలు చేస్తున్న తీరు, చెత్త తరలింపు విధానము మొదలగు అంశాలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మక క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమములో భాగంగా నగరపాలక సంస్థకు కేటాయించబడిన సి.ఎన్.జి ఆటోల యొక్క పనితీరును పర్యవేక్షించారు.

తదుపరి సింగ్ నగర్ ప్రాంతము నందలి ఎక్సెల్ ప్లాంట్ వద్ద వివిధ ప్రాంతముల నుండి సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయు విధానము, చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించు ప్రక్రియను అధికారులను అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో నగరంలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి సిబ్బంది యొక్క పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ను సిద్దం చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.గీతాభాయికు సూచించారు.

అనంతరం కృష్ణలంక జాతీయ రహదారి కనకదుర్గమ్మ వారధి జంక్షన్ నందలి బుద్ద చక్ర పార్క్ నందలి జరుగుతున్న గ్రీనరి అభివృద్ధి పనులను పర్యవేక్షించి, అధికారులతో కలసి ఖర్హుర చెట్టును నాటుట జరిగింది.

పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, హెల్త్ ఆఫీసర్లు  డా.రామకోటీశ్వరరావు, డా.శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  కె.కోటేశ్వరరావు, వి.శ్రీనివాస్, ఎ.డి.హెచ్ శ్రీనివాసులు మరియు శానిటరీ ఇన్స్ పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
..more