దాతృత్వం గొప్ప గుణం: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

12-01-2022 Wed 20:47

విజయవాడ: ఈ రోజు హెల్పింగ్ టుగెదర్ 2009 గ్రూప్ వారి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వివిధ బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలకు అన్నదాన కార్యక్రమము నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమమునకు హాజరయిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతినెలలో రెండు లేక మూడు సార్లు అన్నదాన కార్యక్రమము ట్రస్టు వారు ఏర్పాటు చేపట్టడం అభినందనీయమని సమాజసేవ పట్ల ఆసక్తి భాద్యత కలిగిన పలు స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడుతూ నగరంలో కూడా పలు సామాజిక సేవ కార్యక్రమములు చేపట్టవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమములో సంస్థ ప్రతినిధుల SK. షఫివుల్లా, SK. మల్లిక మరియు సంస్థ సభ్యులు K.అనిల్, సత్య, సాయి, గోపి, వేణు పాల్గొన్నారు.


More Press Releases
..more