ట్విట్టర్ పై హ్యాకర్ల దాడి
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ పై హ్యాకర్లు దాడి చేసారు. సుమారు 2,50,000 మంది సభ్యుల రహస్య సమాచారాన్ని దొంగిలించారు. గత వారం జరిగిన ఈ దాడిలో సభ్యుల యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్, ఈమెయిలు అడ్రస్సులు, తదితర సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారని ట్విట్టర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. హ్యాకింగ్ కు గురైన సభ్యుల ప్రొఫైల్ పాస్ వర్డ్స్ ను మార్చివేసామని ఆ వివరాలను త్వరలోనే ఎవరికి వారికి వ్యక్తిగతంగా తెలియపరుస్తామని ప్రకటించింది. 
Sat, Feb 02, 2013, 11:14 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View