Advertisement .a
హైదరాబాద్ లో సరికొత్త క్యాబ్ సేవలను ప్రారంభించిన ‘ప్రైడో’
Advertisement .b

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ప్రణీత్ గ్రూప్ చే ప్రమోట్ చేయబడిన, హైదరాబాద్ కు చెందిన టెక్ స్టార్టప్ వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ ప్రై.లి. ఈరోజు హైదరాబాద్ లో ‘ప్రైడో’ పేరిట క్యాబ్ హెయిలింగ్ సేవలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే 14,000 మంది డ్రైవర్ భాగస్వాములను చేర్చుకోవడాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సేవలు 2019 సెప్టెంబర్ 29 నుంచి అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

‘ప్రైడో’ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో, ఐఒఎస్ యాప్ స్టోర్ లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘ప్రైడో’ యొక్క ఈ విశిష్ట బిజినెస్ నమూనా వినియోగదారులకు సర్జ్ రహిత ప్రయాణాలకు వీలు కల్పిస్తుంది. డ్రైవర్ భాగస్వాములకు పలు రకాల సంక్షేమ చర్యలను అందిస్తుంది. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్ యూవీ –అనే మూడు విభాగాల్లో ప్రైడో తన సేవలను అందించనుంది.

రానున్న ఆరు నెలల్లో ప్రైడో తన సేవలను ఢిల్లీ, బెంగళూరులకు విస్తరించే యోచనలో ఉంది. అంతేగాకుండా, కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అన్ని మెట్రో నగరాలకు తన సేవలను విస్తరించనుంది. దేశవ్యాప్త విస్తరణకు గాను రూ.100 కోట్ల మొత్తాన్ని వెచ్చించేందుకు కంపెనీ యోచిస్తోంది.

ప్రైడో ఆవిష్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ప్రైడో వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ మార్కెట్ లో ప్రైడో క్యాబ్ హెయిలింగ్ సేవలను ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం. ప్రయాణికుల సురక్షిత, భద్రత, సౌలభ్యం మరియు డ్రైవర్ భాగస్వాముల సంక్షేమం అనేవి మాకు అత్యంత ముఖ్యమైనవి. ప్రయాణికుల భద్రత కోసం మేము ప్రైడో యాప్ ను తెలంగాణ ప్రభుత్వ హాక్ –ఐ యాప్ తో మిళితం చేశాం. క్యాబ్ హెయిలింగ్ పరిశ్రమ ఎంతో వృద్ధిఅవకాశాలను కలిగిఉందని మేము విశ్వసిస్తున్నాం. ఆ అవకాశాలను వెలికితీయాలని భావిస్తున్నాం. హైదరాబాద్ లో రానున్న 3 నెలల్లో పది లక్షల ప్రయాణాలు పూర్తి చేయగలమని మేము ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

‘‘క్యాబ్ హెయిలింగ్ మార్కెట్ లో, పరిశ్రమలోనే మొదటిసారిగా అని చెప్పదగిన కొన్ని విప్లవాత్మక భావన లను మేము ప్రవేశపెడుతుండడం అనేది ప్రైడో క్యాబ్స్ కు గర్వకారణం. ‘హ్యాపీ డ్రైవర్స్ మేక్ హ్యాపీ రైడర్స్’ అని ప్రైడో క్యాబ్స్ విశ్వసిస్తోంది. ప్రైడో ఇటు వ్యాపారంలో, అటు మానసిక ప్రశాంతత లో సమాన అవకాశాలు పొందడంలో డ్రైవర్ భాగస్వాములకు సాధికారికత కల్పిస్తుంది’’ అని ఆయన అన్నారు.

నెలకు చేసే ప్రయాణాల సంఖ్యను బట్టి డ్రైవర్ భాగస్వాముల నుంచి ప్రైడో 0-10 % కమీషన్ ను వసూలు చేస్తుంది. వారిపై ఒత్తిడి లేకుండా చేసేందుకు గాను నెలవారీ ప్రాతిపదికన అత్యధిక సంఖ్యలో ప్రయాణాలకు తక్కువ /జీరో కమీషన్ ను కంపెనీ వసూలు చేస్తుంది. బిల్లింగ్, ఇన్వాయిస్ విధానాల్లో పారదర్శకతకు ప్రైడో హామీ ఇస్తుంది.

ప్రైడో దిగువ ఫీచర్లను అందిస్తుంది. ఇవి క్యాబ్ హెయిలింగ్ పరిశ్రమలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టబడుతున్నాయి.

ప్రైడో మరియు ప్రణీత్ గ్రూప్ గురించి:

ప్రైడో అనేది హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ప్రణీత్ గ్రూప్ చే ప్రమోట్ చేయబడిన వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ ప్రై.లి. బ్రాండ్. అంతర్జాతీయ క్యాబ్ హెయిలింగ్ సర్వీస్ ప్రొవైడర్ గా ఎదగడం ద్వారా పరిశ్రమలో సంచలనం కలిగించడం ప్రైడో లక్ష్యం. 

హైదరాబాద్ లోని అగ్రగామి మరియు అత్యంత విశ్వసనీయ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటి ప్రణీత్ గ్రూప్. 2007లో ఇది నెలకొల్పబడింది. నమ్మకం మరియు నాణ్యత తో కూడిన సేవలను అందించడాన్ని ఇది విశ్వసిస్తుంది. ఇంజినీరింగ్, డిజైన్ లలో అగ్రగామిగా ఈ గ్రూప్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోప్రముఖంగా ఉంది. ఇది గత 12 ఏళ్ళలో 4,000 యూనిట్లను అందించింది. ఏళ్లు గా ఈ కంపెనీ హైదరాబాద్ లో మరియు చుట్టుపక్కల 22 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. రూ.300 కోట్ల టర్నోవర్ తో ప్రణీత్ గ్రూప్ రానున్న ఏళ్ళలో ఎంతగానో విస్తరించేందుకు చూస్తోంది. వివిధ విభాగాల్లో ఈ గ్రూప్ 500 మందికి పైగా సిబ్బందిని కలిగిఉంది. 

తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుబంధంగా కాంక్రీట్, యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్, ఇంటీరియర్స్ లలో కూడా ప్రణీత్ గ్రూప్ తన ఉనికిని విజయవంతంగా పటిష్ఠం చేసుకోగలిగింది. ఈ గ్రూప్ ఇటీవలే విద్య, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ రంగాల్లోకి కూడా ప్రవేశించింది.

Thu, Sep 26, 2019, 04:08 PM
Advertisement .b
2020-08-12T12:04:48+05:30
2020-08-11T20:34:37+05:30
2020-08-11T20:25:06+05:30
2020-08-11T20:12:24+05:30
2020-08-11T20:09:11+05:30
2020-08-11T19:31:55+05:30
2020-08-11T19:24:03+05:30
2020-08-11T19:06:46+05:30
2020-08-11T19:01:40+05:30
2020-08-11T18:55:29+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View