58వ డివిజన్ లో అభివృద్ది పనులను పరిశీలించిన వీఎంసీ కమిషనర్

03-12-2021 Fri 20:26

విజయవాడ: నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సింగ్ నగర్, 58వ డివిజన్ పరిధిలోని పలు వీధులలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలో చేపట్టిన మరియు చేపట్టవలసిన అభివృద్ది పనుల వివరాలు డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి కమిషనర్ కి వివరిస్తూ, అభివృద్ది పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. శివారు ప్రాంతాలలో అభివృద్ది పరిచిన రోడ్లను పరిశీలిస్తూ, మిగిలిన పనులకు కూడా టెండర్ ప్రకియను పూర్తి చేయాలన్నారు.

ఇందిరా నాయక్ నగర నందు నిర్మాణములో ఉన్న వై.ఎస్.ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ యొక్క నిర్మాణ పనులు మరియు ఆర్ అండ్ బి కాలనీ నందు జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపు లైన్ ఏర్పాటు పనుల యొక్క పురోగతి పరిశీలించి పలు సూచనలు చేస్తూ, పార్క్ ఏర్పాటుకు తగిన స్థలన్ని గుర్తించాలని అన్నారు. పై ప్రదేశాలలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, సైడ్ డ్రెయిన్ ద్వారా మురుగునీటి పారుదల మొదలగు అంశాలను స్థానికులను అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఒన్ టౌన్ రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న షాదీ ఖానా నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతము చేయాలని అధికారులకు సూచించారు.

పర్యటనలో ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) పి.వి.కె భాస్కరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి.శ్రీనివాస్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వర రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మరియు శానిటరీ ఇన్స్ పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


More Press Releases
..more