రైఫిల్ షూటింగ్ పోటీకి ఎంపికైన తెలంగాణ సీఎం సెక్యూరిటీ వింగ్ మహిళా హెడ్ కానిస్టేబుల్!
Advertisement
ఇటలీ దేశంలో జరిగే రైఫిల్ షూటింగ్ పోటీకి తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎస్ గీత ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా ఇటలీలో ఈ నెల 19 నుండి 26 వరకు జరిగే 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో ఆమె పాల్గొననున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన గీత మహబూబాబాద్ పోలీస్ పేరెంట్ డిపార్ట్మెంట్ కు ఎంపికై ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.
Thu, Sep 19, 2019, 10:05 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com