జక్కంపూడి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి

24-09-2021 Fri 20:57

విజ‌య‌వాడ‌: పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జక్కంపూడి ప్రాంతములోని సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) ను శుక్రవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజా మరియు అధికారులతో కలసి పరిశీలించారు. జక్కంపూడి గృహ సముదాయముల ప్రాంతములో Jnnurm నిధులతో చేపట్టిన ప్లాంట్ సుమారుగా 80 శాతం పూర్తి కాబడినవని, మిగిలిన పనులు చేపట్టవలసియున్నదని అధికారులు వివరించారు. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నకు సంబందించి ఇంకను చేపట్టవలసిన పనులకు సంబందించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకొని ప్లాట్ పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకువచ్చేలా తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అధికారులకు వివరించారు.

పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.వి.కె భాస్కర్, డిప్యూటీ ఇంజనీర్ రవి కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


More Press Releases
..more