సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ తనిఖీ చేసిన వీఎంసీ క‌మిష‌న‌ర్

24-09-2021 Fri 20:53

విజ‌య‌వాడ‌: ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు / సేవలను ప్రజలకు చేరువ చేయుటతో పాటుగా బాధ్యతాయుతంగా  సచివాలయ సిబ్బంది తమ యొక్క విధులు నిర్వహించాలని క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఆదేశించారు. శుక్రవారం 12వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్, యనమలకుదురు లాకులు ప్రాంతాలలో గల 49, 50, 52 మరియు 53 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ మరియు ప్రజలు అందించు అర్జిలను నమోదు చేయు రిజిస్టర్ లను పరిశీలించారు. సచివాలయంలో విధులు నిర్వహించు సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని, సేవా దృక్పథం పని చేయాలని అన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకముల యొక్క వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా డిస్ ప్లే చేయలాని సూచిస్తూ, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.


More Press Releases
..more