అట‌వీ అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

11-09-2021 Sat 20:27

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 11: స‌మాజానికి, ప్ర‌కృతికి మేలు చేకూర్చే అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు అట‌వీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అట‌వీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అమ‌రుల‌కు ఘనంగా నివాళులర్పించారు. జూ పార్కు వ‌ద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు.
 
అనంత‌రం స‌భ‌లో ప్ర‌సంగిస్తూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రుల‌య్యార‌ని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారన్నారు. ముఖ్యంగా అటవీ సంప‌ద‌ను కాపాడ‌టంలో ఎన్నో సవాళ్ళ‌ను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అట‌వీ సంప‌ద‌ను దోచుకునే దొంగ‌లు, మాఫియా ముఠాల‌కు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధాపోవ‌న్నారు. వారి త్యాగ‌ల‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటామ‌ని తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం తలెత్తిన తొలి రోజుల్లో సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక ప్రపంచం యావత్తూ విస్మయం చెందిందని పేర్కొన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అటవీ సంపదను కాపాడడంలో సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. అట‌వీ సంప‌ద‌ను దోచుకునే దొంగ‌లు, మాఫియా ముఠాల‌కు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధాపోవ‌ని, వారి త్యాగ‌ల‌నే ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటామ‌న్నారు.

అట‌వీ సంప‌ద‌ను కాపాడడానికి అట‌వీ అధికారులు నిరంత‌రం సేవ‌లు అందిస్తున్నార‌ని వారి ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని, విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రులైన అట‌వీ అధికారులు, సిబ్బంది కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో FDC చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, పీసీసీఎఫ్ లు దొబ్రియల్, లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, FDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి ప్రసంగం:


More Press Releases
..more