ఆప్కో బలోపేతానికి విశేష కృషి చేసిన అంబేద్కర్

27-07-2021 Tue 20:51

విజయవాడ: ఆప్కో బలోపేతానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని ఆ సంస్థ చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అన్నారు. ఆప్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త పాలనాధికారిగా బదిలీపై వెళుతున్న అంబేద్కర్ కు ఆప్కో అధికారులు, సిబ్బంది మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు.

తొలుత ఆప్కో చైర్మన్ మోహనరావు అంబేద్కర్ ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆప్కో జీఎం లేళ్ల రమేష్ బాబు, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, ఆప్కో అధికారులు, సిబ్బంది అంబేద్కర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఏలూరులో అంబేద్కర్ బాధ్యతలు తీసుకోనున్నారు. 


More Press Releases
..more