ఈ నెల 28న నెక్లెస్ రోడ్ లో పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు: కేకే

24-06-2021 Thu 14:43

హైదరాబాద్: ఈ నెల 28వ తేదిన హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగే భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరవుతారని, శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు కె. కేశవరావు తెలియజేశారు.

గురువారం బిఆర్ కెఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శతజయంతి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. శత జయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


More Press Releases
..more