అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

02-06-2021 Wed 12:10

హైదరాబాద్: అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ సిబ్బంది వేడుకల్లో పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు, సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. 


More Press Releases
..more