నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎస్

02-06-2021 Wed 10:03

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 ను పురస్కరించుకొని బిఆర్ కెఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయగీతాలాపన చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ప్రోటోకాల్ విభాగం  డైరెక్టర్ అర్విందర్ సింగ్, సీనియర్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


More Press Releases
..more