'విశ్వరూపం'కు తొలగని అడ్డంకులు
'విశ్వరూపం' సినిమా విడుదలపై సస్పెన్స్ వీడడం లేదు. తమిళనాడులో ఈ చిత్రం విడుదలపై  ముస్లిం సంఘాలతో కమల్ సోదరుడు చంద్రహాసన్  జరిపిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల కోసం ముంబై వెళ్లిన కమల్ హాసన్ తిరిగి వచ్చాక ఆయనతోనే చర్చిస్తామని ముస్లిం సంఘాలు తేల్చి చెప్పాయి. మరోవైపు 'విశ్వరూపం'పై ఫిబ్రవరి 4న తమిళనాడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఫిబ్రవరి 6న హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
Fri, Feb 01, 2013, 08:37 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View