హిందీ 'విశ్వరూపం' నేడు విడుదల
వివాదాస్పద 'విశ్వరూపం' చిత్రం
హిందీ వెర్షన్ నేడు దేశమంతటా విడుదల అవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్
కార్యక్రమాలలో కమలహాసన్ పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ముంబయ్ లో పత్రికా
సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమా విషయంలో
కమల్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

ఇదిలా ఉంచితే, కమల్- ముస్లిం సంఘాలు
కలిసి ఓ నిర్ణయంతో వస్తే కనుక, సమస్య పరిష్కారానికి సహకరిస్తామని తమిళనాడు
ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కమల్ ముస్లిం సంఘాలతో
భేటీ కానున్నారు. తమిళనాట ఈ చిత్రాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే!
Fri, Feb 01, 2013, 10:03 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View