తప్పనిసరి అయితేనే బయటికి రండి.. ఇంట్లో కూడా మాస్క్ వాడాలి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

17-04-2021 Sat 14:51

కామారెడ్డి: కోవిడ్ నియంత్రణ,వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశపు హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలోని పలు నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుుడు బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జడ్పీ చైర్ పర్సన్ శోభా, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే పలువురు రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులు పాల్గొన్నారు. 


More Press Releases
..more