పీవీ శతజయంతి ఉత్సవాలను జయ ప్రదం చేయండి: తనుగుల జితేందర్ రావు

07-04-2021 Wed 21:04

హైదరాబాద్: పీవీ శతజయంతి ఉత్సవాలను జయ ప్రదం చేయలని యూనిటి ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా జాతీయ ప్రధాన కార్యదర్శి తనుగుల జితేందర్ రావు పిలుపునిచ్చారు.

పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 15 సామాజిక సేవా సంస్థలు, పీవీ అభిమాన సంఘాలు దేశవ్యాప్తంగా 12 రంగాలకు చెందిన విశిష్ట సేవలందించిన వారికి 81 మంది తెలుగువారికి మన తెలుగుతేజం జాతీయ అవార్డులు అందజేస్తున్నట్లు పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్, మన తెలుగు తేజం జాతీయ అవార్డుల కన్వీనర్ పి.వెంకటరమణ గుప్త తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 9న బి.ఎం.బిర్లా మ్యూజియంలోని భాస్కర ఆడిటోరియంలో మధ్యాహ్నం 3గం.లకు నిర్వహించబడుతుందని తెలిపారు.


More Press Releases
..more