కేసీఆర్, కోదండరాంలపై మరో కేసు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు,
తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాంలపై విజయవాడలో మరో కేసు నమోదు కానుంది.
సమరదీక్షలో జాతీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను వీరిపై కేసు
నమోదు  చేయాలని విజయవాడ నగర ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్
పోలీసులను ఆదేశించారు. న్యాయవాది సురేష్ ఇచ్చిన ఫిర్యాదుతో వీరిపై ఐపీసీ
సెక్షన్లు 124ఏ, 153ఏ, 153బీ, 504, 505,506 కింద కేసు నమోదు చేయాలని
న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
Fri, Feb 01, 2013, 07:02 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View