236 కోట్లు పలికిన పికాసో బొమ్మ
వేలం వెర్రి అంటే ఇదేనేమో...
ఓ చిత్రకారుడు గీసిన ఓ బొమ్మ 236 కోట్ల పైచిలుకు రేటు పలికింది.
వివరాల్లోకి వెళితే... ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో 1932లో వేసిన
'ఉమన్ సిటింగ్ నియర్ ఎ విండో' అనే కళాఖండాన్ని తాజాగా లండన్లో వేలం పాటకు
పెట్టారు.

పెయింటింగు లంటే పడిచచ్చే ధనికులైన రసజ్ఞులు ఆ చిత్ర రాజం కోసం
పాట పాడుతూ ఎగబడ్డారు. ఈ పోటీలో ఓ ఆసామీ అందరి కంటే ఓ అడుగు ముందుకేసి,
28.5 మిలియన్లకు (అంటే సుమారు 236 కోట్లు) హై పిచ్ లో పాట పాడేసి, దానిని
సొంతం చేసుకున్నాడు. అందుకే అంటారు... ఎవరి పిచ్చి వాళ్లదని... ఏమంటారు?  
Thu, Feb 07, 2013, 09:42 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View