నరేంద్రమోడీకి నెహ్రూ స్థాయిలో ప్రజాదరణ వుంది: అశోక్ సింఘాల్
భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు దేశ ప్రజలలో వున్న ఆదరణ అంతా ఇంతా
కాదు. అటువంటి నాయకుడితో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు
నరేంద్ర మోడీని పోలుస్తున్నారు, వీహెచ్పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్.
నెహ్రూ స్థాయిలో మోడీ దేశ ప్రజల ఆదరణ చూరగొన్నారని ఆయన ప్రశంసించారు.

నెహ్రూ తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడిని, ప్రజల
విశ్వాసాన్ని పొందిన నేతను ఇంత కాలానికి నరేంద్రమోడీలో చూడగలుగుతున్నామని ఆయన అన్నారు. విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ అలహాబాదులో
మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోడీ అభ్యర్ధిత్వానికి ఈ విధంగా ఆయన మద్దతు పలికారు.
Thu, Feb 07, 2013, 07:22 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View