రవీంద్రనాథ్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
కడప మాజీ మేయరు రవీంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. కడప జిల్లాలో  తనపై వేసిన కేసును కొట్టివేయాలని, తన అరెస్టుపై కూడా స్టే విధించాలని కోరుతూ రవీంద్రనాథ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపిన న్యాయస్థానం... రవీంద్రనాథ్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు కడప జిల్లాలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు.
Wed, Feb 06, 2013, 08:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View