అమెరికాలో ఫార్మసీ విద్య మరింత సులభం: జేఎన్టీయూ వీసీ
బీ ఫార్మసీ  పూర్తయ్యాక అమెరికాలో ఎంఎస్ డిగ్రీ చేసేందుకు విద్యార్థులకు మార్గం సుగమం అయింది. ఇందుకోసం హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ), అమెరికాలోని ఫసిఫిక్ యూనివర్శిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అమెరికా విశ్వవిద్యాలయంలో సీటుకోసం విద్యార్థులు పడే ఇబ్బందులకు తెరపడనుందని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ రామేశ్వరరావు అన్నారు.

తాజా ఒప్పందం ద్వారా ఫార్మసీ విద్య పూర్తి చేసిన నాణ్యమైన విద్యార్థులు పరిశ్రమలకు వెళ్లే అవకాశం ఉందని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ థనానీ చెప్పారు. ఈ ఒప్పందంలో జేఎన్టీయూకు అనుబంధ కళాశాల అలియన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ సైన్సెస్  మొదటి భాగస్వామిగా ఉంది.
Wed, Feb 06, 2013, 07:44 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View